తాజాగా ది డైలీ మెయిల్ వార్తా పత్రిక నిర్వహంచిన సర్వేలు 8 శాతం మంది మహిళలు తమకు లాభం చేకూరుతుందన్న ఆశతో రాత్రికి రాత్రే స్నేహితులతో అద్భుత రతిక్రీడలు ఆచరించి ఆనందించారని వెల్లడయింది. వీరి పోకడ ఎలా వుందంటే, ఎవరినైనా సరే మీరు అమితంగా ప్రేమిస్తూ వుంటే, వారితో శారీరక సంబంధంలో తప్పు లేదని అంటారు. అయితే, దాని ఫలితాలు ఎలా వుంటాయో వాటికి కూడా సిద్ధంగా వుంటామని కూడా వీరు తెలుపుతున్నారట.
స్నేహితులవలన అదనపు లాభం, సెక్స్ ఆనందం. దీనివలన ఏ రకమైన బాదరబందీ వుండదు. ఎపుడు కావాలంటే అపుడు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆనందించవచ్చు. దీర్ఘకాలంలో వివాహం, పిల్లలు అంటూ ఒకరితో మరి ఒకరు కట్టుబడి వుండాల్సిన అవసరం లేదు. రతి కోర్కెలు ఆనందించేయడం, ఆపై ఎవరికి వారే అంటూ విడిపోవటం. ఈ రకమైన సంబంధాలు కాలేజీలలో సైతం మొదలయ్యాయి. వీరి ధోరణి ఇవ్వటం, పుచ్చుకోవడం మాత్రమే. ఇద్దరికి అంగీకారం అనుకుంటే రతిక్రీడ కొనసాగుతుంది. కాలేజీ చదువులు పూర్తయితే, సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదు.
ఏదో ఒక క్షణంలో మీరు మీ స్నేహితుడు లేదా స్నేహితురాలికి ఆకర్షించబడే వుంటారు. ఇద్దరికి సంబంధం పట్ల అవగాహన వుంటే వారు ఫలితాలకు లేదా విడిపోవటానికి బాధపడే సమస్యేలేదు. ఫన్ కొరకు సెక్సా లేక హృదయపూర్వకంగా ప్రేమించటమా అనేదానికి తేడాలు తెలుసుకోవాలి. మనకు ఏం కావాలి, ఎందుకు కావాలి అనేది నిర్ణయించుకొని దాని వలన వచ్చే ఫలితాలకు కూడా సిద్ధంగా వుండాలి.
అయితే ఒక్కొకపుడు ప్రస్తుతానికి ఒకరితో మరి ఒకరు ఆనందించేసినా...చివరకు విడిపోవటం వచ్చేసరికి బాధగానే వుంటుంది. అటువంటి వారిమధ్య వుండే మంచి స్నేహం సైతం మరుగునపడి ఎప్పటికి మరచిపోలేని బాధగా కూడా వుంటుంది. ప్రేమించటం, రతిక్రీడ అనుభవాలు వంటివి ఎంత వేగంగా అయిపోతూ వుంటే, వాటిలోని ప్రాధాన్యత అంతబాగా తరిగిపోతుంది. చివరకు జీవితంలో ఏదో కోల్పోయిన లోటు. చివరకు అసలు అదంటూ జరిగితే కట్టుకున్న భాగస్వామితో కూడా సర్దుబాటు చేసుకోలేని స్ధితి ఏర్పడచ్చు. కనుక యువతీ యువకులు వెర్రి పోకడలు పోక వాస్తవ సంప్రదాయాల నీడలో నడవాల్సిన అవసరం వుంది.