రతితో రోగ నివారణ.... అనేది ఎపుడైనా విన్నారా? ఇది సామెతవంటిదికాదు. రతితో కొన్ని రోగాలు శారీరకం, మానసికం వంటివి నివారణ చేసుకోవచ్చు. కొత్తవి రాకుండా కూడా రక్షించుకోవచ్చు అంటున్నారు విషయ నిపుణులు. మానవుడికి తెలిసిన మొట్టమొదటి ఔషధం....రతి. అది రోజూ చేస్తే ప్రయోజనమే. అది ఎలా? అనేది పరిశీలించండి.
అద్భుతమైన వ్యాయామం - రతిలో శారీరక శ్రమ లభిస్తుంది. బద్ధకం లేకుండా అన్ని అంగాలు కదుపుతూ చేస్తే శారీరక కదలికలు, మీరు చేసే వ్యాయామంలానే వుంటాయి. శ్వాస పెరుగుతుంది. మీకు అలసట కలుగుతుంది. కేలరీలు ఖర్చవుతాయి. వారానికి మూడు సార్లు, ఒక్కోసారి 15 నిమిషాల చొప్పున రతి చేస్తే సంవత్సరానికి సుమారుగా 7,500 కేలరీలు ఖర్చవుతాయి. అంటే జాగింగ్ లో 75 మైళ్ళు పరుగెట్టారన్నమాటే. శ్వాస గట్టిగా పీల్చటంతో శరీర కణాలలో ఆక్సిజన్ అధికమవుతుంది. ఈ చర్యలో ఉత్పత్తి అయే టెస్టోస్టిరోన్ హార్మోన్ మీ ఎముకలను, కండరాలను బలంగా వుంచుతుంది.
నొప్పులు మాయం - హనీ ....తలనొప్పి అంటున్నారా? రతి చేసి చూడండి తలనొప్పి మాయం. రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్లు పెయిన్ కిల్లర్లవలే పనిచేస్తాయి. మహిళలలో రోజూ చేస్తే...ఫలదీకరణ సత్తువ పెరుగుతుంది. మెనోపాజ్ త్వరగా రాదు. పిరీయడ్ నొప్పులు అసలే రావు.
ప్రొస్టేట్ గ్రంధికి రక్షణ - స్కలనంలో విడుదలయ్యే ద్రవాలు ప్రొస్టేట్ గ్రంధి నుండే. స్కలనం ఆగితే, గ్రంధి నిండుతుంది. ఉబ్బుతుంది. సమస్యలు వస్తాయి. రెగ్యులర్ గా ద్రవాలు బయటకు వదిలేస్తే ఈ గ్రంధికి ఎంతో మంచిది.
స్తంభన సమస్యలా? 40 సంవత్సరాల వయసు పైబడ్డవారిలో 50 శాతం అంగస్తంభనతో బాధపడతారు. ఈ రకమైన నపుంసకత్వానికి మంచి ఔషధం ...రోజూ రతి చేసేయడమే. అంగ స్తంభనలో రక్తం జననాంగ రక్తనాళాలనిండుగా ప్రవహించి ఆరోగ్యంగా వుంచుతుంది. డాక్టర్లు అంగస్తంభన ఒక క్రీడాకారుడి వ్యాయామం వంటిదంటారు. ఎంతాబాగా చేస్తూ వుంటే అంత బాగా మీరు చేయగలరు.
ఒత్తిడి నుండి రక్షణ - ఇది సైంటిఫిక్ గా రుజువైపోయింది. ఒత్తిడి స్ధాయి రతి తర్వాత బాగా తగ్గుతుంది. దీనికి కారణం మీ శరీరం ఒత్తిడి హార్మోన్లతో పోరాడే డోపమైన్ అనే సంతోషకర హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఈ పని మీ పిట్యూటరీ గ్రంధి ఖచ్చితంగా చేసి మీకు ఆనందాన్నిస్తుంది. ఒత్తిడిని మాయం చేస్తుంది.