ఆ సమయంలో చేసే రతి ఆమెకు ఎంతో రిలీఫ్ ఇస్తుందంటున్నారు గైనకాలజిస్టులు. రతి శరీరంలోని ఎండార్ఫిన్లను రిలీజ్ చేసి హాయి అనే భావననిస్తుంది. మహిళకు రుతు సంబంధిత నొప్పులు చాలావరకు తగ్గిస్తుంది. మంచి సుఖాన్ని అందిస్తే చాలు మనోవేదన, ఆందోళనలు, కోపం వంటివి ఆమెలో మటుమాయం. రతిలో పడే శారీరక శ్రమ గర్భంలోని సంకోచ వ్యాకోచాలను పెంచి రక్త ప్రసరణ అధికం చేస్తుంది. దీనితో రుతుక్రమ రోజులు కూడా తగ్గిపోతాయి. అసలు పిరీయడ్స్ సమయంలోనే మహిళలు రతిని అద్భుతంగా ఆనందించేస్తారని రీసెర్చి చెపుతోంది.
జననేంద్రియాలు పూర్తిగా రక్తంతో నిండి వుండటంతో ఆనందం మరింత అధికమై చక్కటి భావప్రాప్తి కూడా కలుగుతుంది. పిరీయడ్ వస్తోందంటే చాలు మహిళలో కామోద్రేకం కలుగుతుంది. దీనికి కారణం ఆమెలో చెలరేగే హార్మోన్ల ప్రభావం. ఈ సమయంలో చేసే రతికి గర్భ నిరోధక సాధనాలవంటివి కూడా అవసరం లేదు. రిస్కు అతి తక్కువనే చెప్పాలి. కనుక కండోమ్ తో ఇంతవరకు కష్టాలు పడే వారికి ఇది మంచి అవకాశం.
అయితే, ఇన్ ఫెక్షన్ల కారణంగా కండోమ్ వాడకం మంచిదే నంటున్నారు. అంతేకాదు ఈ సమయంలో కొత్త భంగిమలు లేదా నోటి సెక్స్ వంటివి ఆమెకు అసౌకర్యం కలిగించవచ్చు. ఇద్దరికి అంగీకారమైతే ఆనందించేయవచ్చు. సాధారణంగా మహిళ పిరీయడ్ పొందితే, ఇక ముట్టరాదంటారు. దీనికి కారణం రక్త స్రావమే. అయితే, అది పెద్ద అడ్డంకి కాదంటున్నారు వైద్య నిపుణులు. స్టడీల మేరకు రుతుక్రమంలో కూడా రతి ఆనందించదగినదేనని చెపుతున్నారు.