•  

మహిళ రతిక్రీడ ఎందుకు కోరుతుంది?

Why Women want Romance
 
మహిళలు రతిక్రీడలో పాల్గొనేది... ప్రేమానురాగాలకొరకు, తమ వాంఛ కొరకే కాదు, లైంగికేతర కారణాలుగా కూడా రతిక్రీడను కోరతారు. విసుగుపుట్టిన వారి దైనందిన జీవితం, పాపం పురుషుడు అంటూ మగవాడిపై సానుభూతి, వారికిగల మైగ్రేన్ వంటి తీవ్ర తలనొప్పులు పోగొట్టుకోడానికి కూడానని ఒక పుస్తకం వెల్లడి చేస్తోంది. ఈ పుస్తకంలో రొమాంటిక్ అవసరాలను పక్కనపెడితే, మహిళలకు గల శారీరక, మానసిక ఇతర కారణాలు సుమారు 200 వరకు రచయితలు సింటే మెస్టన్, డేవిడ్ బస్ లు వివరించారు. ఆకర్షణ అనే అంశం జాబితాలో చివర ఎక్కడో వుందట. వీరికిగల కారణాలలో పురుషుడు ఆమెకు ఇచ్చే మంచి డిన్నర్ కు ధ్యేంకూ గా కూడా వారు రతిక్రీడ సాగించేస్తారట.

రీసెర్చిలో చాలామంది పురుషులు చాలామంది మహిళలను కనీసం ఒకమాదిరిగా సెక్సీగా ఆకర్షిస్తున్నావని ప్రశంసించారట. కనీ మహఇళలు మాత్రం తమ పురుషులు సెక్సువల్ గా తమను ఆకర్షించటంలేదని తెలిపినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై టెక్సాస్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్లు షుమారు 1,006 మంది మహిళలను రీసెర్చి చేసి ఆశ్చర్యపోయే సమాధానాలను రాబట్టారట. ఒక మహిళ సంభోగం అనేది భగవంతుడికి దగ్గరగా తీసుకు వెళుతుందనే కారణంగా ఆధ్యాత్మిక అనుభవం కొరకు సంభోగిస్తున్నానని, మరో మహిళ తన తలనొప్పికి చికిత్సగా రతిక్రీడ ఆచరిస్తానని, మరో మహిళ, తనకు మంచి చర్మ కాంతి రావాలని, మరో మహిళ తన రతిక్రీడ నైపుణ్యం పెంచుకోటానికి రతి చేస్తున్నానని, తెలిపారట.

84 శాతం మంది మహిళలు తమ భాగస్వామితో జీవితం ప్రశాంతంగా గడవటానికిగాను తాము రతికి సిద్ధమైనట్లు తెలిపారట. కొన్ని సమాధానాలలో పురుషులమీద జాలికొద్దీ కూడా రతికి ఒప్పుకుంటున్నట్లు తెలిసింది. పదిమందిలో ప్రతి ఒక మహిళ మాత్రం, పురుషుడు ఇచ్చే బహుమతులకు బదులుగా లేదా మంచి స్టార్ హోటల్ డిన్నర్ పొంది, లేదా విలాసవంతమైన జీవితాన్ని అందించినందుకు, దానికి ప్రతిఫలంగా కూడా అందుకు అంగీకరించేస్తున్నారట.

English summary
One of the surveys carried out by the authors revealed that one in ten women admitted having sexual intercourse in return for presents, or lavish meals. Responses included "he bought me a nice dinner" or "he spent a lot of money on me early on", "he gave me gifts early on" and "he showed me he had an extravagant lifestyle".
Story first published: Wednesday, January 25, 2012, 16:26 [IST]

Get Notifications from Telugu Indiansutras