ఆమె తన కన్యత్వం పట్ల చేసిన ఈ వేలంపాట అందరిని ముక్కుమీద వేలేయించింది. హాట్ హాట్ గా అందరూ చర్చించేశారు. సరి కాదన్నారు. నైతిక విలువల పతనం అన్నారు. కాని అమ్మడు నేటాలీ మాత్రం తన నిర్ణయంలో ఏ మాత్రం నైతిక సందిగ్ధతలు లేవని కొట్టిపారేసింది. తన కన్నెత్వంపై తనకు సాధికారం వుందని....తన ఇష్టం వచ్చిన వ్యక్తికి బహిరంగంగా, అదికూడా వేలంపాట పెట్టి మరీ అమ్మేస్తున్నానని తెలిపింది.
మరి ప్రస్తుత రోజుల్లో వర్జినిటీ లేదా కన్నెత్వం అనేది ఎంతవరకు యువత కోరుతోంది. అసలు దానిపై వారి వైఖరి ఏమిటి వివాహ వ్యవస్ధ విలువలేమిటి? వివాహం అయ్యేటంతవరకు కన్నె పిల్లగా వుండటమా? లేక అవకాశం వచ్చినపుడు దానికి వెలకట్టి అమ్మేసి మరల వివాహానికి దిగడమా? ప్రస్తుతం నడుస్తున్న రొమాన్స్ చర్యలు సూస్తుంటే, సమాజం మారిపోతున్న పరిస్ధితి పరిశీలిస్తే, యువతకు తమ రతి విలువలు అతి త్వరలోనే పోవటానికి, సమాజం చెడిపోవటానికి అవకాశాలు అనేకంగా వున్నాయి.
నగరాలలో టీనేజ్ పిల్లలు చాలా తక్కువ వయసులోనే రొమాన్స్ చేస్తున్నారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి యువతికి ఒక బాయ్ ఫ్రెండ్, ప్రతి యువకుడికి ఒక గాల్ ఫ్రెండ్ వుండటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయినప్పటికి కన్నెత్వం వదులుకోవడం విషయంలో ఇంకా కొంతమంది మౌనం వహిస్తూనే వున్నారు. అయితే, విషయ నిపుణులు మాత్రం. నేటిరోజుల్లో కన్నెత్వం అనేది అసలు ఒక సమస్య కాదంటారు. నగరాలలో పెరిగే యువతులు తాము కన్నెలం కాదనే విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు. యువతులు తమకిది మొదటి ఆనందం అంటూ చెప్పేయటం చేసేయటం జరుగుతోంది. తన కన్నెత్వాన్ని అమ్మేసుకున్న నేటాలీ టెలివిజన్ ఇంటర్వూలో...ఇపుడంతా నడిచేది కేపిటలిస్ట్ సొసైటీ అని, తాను తన కన్నెత్వంపై పెట్టుబడి పెట్టానని నిర్మొహమాటంగా తెగేసి చెప్పింది. తాను చేస్తున్న రతి సేవలకు అది నష్టపరిహారమంది. రేటు ఎక్కవ పలకటంతో తాను వార్తలలోకెక్కాన్నది. బహుశ అది అమెరికా కాబట్టి అంతా సరి. కాని నైతిక విలువలు కల భారతదేశంలోని యువత ఇంత బహిరంగంగా తమ కన్నెత్వానికి వెల కట్టకపోవచ్చు.