ప్రతిరోజూ తగిన విధంగా ఆరోగ్యంగా రతిక్రీడలాచరిస్తే రోగ నిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది. మైండ్, శరీరం రెండూ కూడా రిలాక్స్ అవుతాయి. సాధారణ ఇన్ఫెక్షన్లు దగ్గు, జలుబు, తుమ్ములు, తలనొప్పి వంటివి దగ్గరకు రాకుండా చేస్తుంది. రతిక్రీడ సాధారణంగా వచ్చే సంతాన సాఫల్యత సమస్యలను తొలగిస్తుంది. ఒత్తిడి కారణంగా వీర్యకణాలు తక్కువ వుండే వారికి ఒత్తిడి తగ్గించి వీర్యకణాల సంఖ్య అధికం చేస్తుందని రీసెర్చర్లు తెలుపుతున్నారు. వీర్యం పరిమాణంలోను నాణ్యతలోను మెరుగుపడుతుంది. ప్రతిరోజూ చేసే రతి అంగం చొచ్చుకుపోవటంలోను వీర్యకణాలు గర్భాశయంలోకి వేగవంతంగా ప్రయాణించటంలోను సహకరిస్తుంది. శరీరం అంతా రక్తం వేగంగా ప్రవహించి జననాంగభాగాల కణాలకు కూడా వ్యాపించి సమర్ధత పెంచుతాయి.
ప్రతిరోజూ రతిచేస్తే శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్లు శరీరాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఇది మహిళలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది. మానసికంగా, శారీరకంగా శరీరం బాగా ఎదుగుతుంది. డైలీ రతి చేసే వారికి చర్మం మెరుపులీని ఏ మాయిశ్చరైజర్లు ఇవ్వలేనంత సహజ కాంతి వస్తుంది. అన్నిటికి మించి, రోజూ చేసే రతి శరీరంలో ఎండార్ఫిన్లను రిలీజ్ చేసి ఆనందాలను కలిగిస్తుంది. ఈ హార్మోన్లు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఎండార్ఫిన్లతోపాటు పెయిన్ కిల్లర్లుగా పని చేసే ఆక్సీటోసిన్ లు శరీరంలోని కాళ్ళనొప్పులు, మహిళలలో వచ్చే పిరీయడ్ నొప్పులను కూడా తగ్గిస్తాయి.