
అంగస్తంభన లేకపోవటం - అంగస్తంభన సరి లేదనుకోవడం అంటే సరైన అవగాహన లేకపోవడమే. నలభై సంవత్సరాల వయసు పైబడిన వారికి సాధారణంగా ఈ సమస్య వస్తుంది. చాలామంది ఇది మానసిక సమస్యగా భావించి పరిష్కరించేదికాదని వదిలేస్తారు. కాని కొన్ని మందులతోను, వైద్య విధానాలతోను ఈ సమస్యను చక్కగా అధిగమించవచ్చు.
మెనోపాజ్ - ఇది మహిళలలో వచ్చే శారీరక మార్పుల కారణంగా వారికి కామ వాంఛ వెనుకబడుతుంది. తగ్గిన హార్మోన్లు యోని పొడిబారి రతి సమయంలో నొప్పిని కలిగిస్తాయి. ఈ కారణంగా భావ ప్రాప్తి పొందటీనికి కూడా సమయం పడుతుంది. అయినప్పటికి భాగస్వామి సహకారంతో కొంతమేర అధిగమించవచ్చు.
డిప్రెషన్ - తరచుగా యాంటీ డిప్రెషన్ మందులు వేయడం కూడా కామవాంఛ తగ్గిస్తుంది. డిప్రెషన్, దానికి వాడే మందులు కూడా వాంఛ తగ్గించటంతో వీరికి వెంటనే వైద్య సలహాలు సరైన మెడిసిన్ అవసరంగా వుంటుంది.
నిద్ర లేకుండుట - నిద్రకు కామ వాంఛకు సంబంధం వుందని పరిశోధకులు తెలుపుతారు. మీరు ప్రతిరోనజూ సరిగా నిద్రించక, మీ నిద్రను వారానికోసారిగా అధికంగా పోతున్నట్లయితే కూడా మీలో కామ వాంఛ తగ్గిపోతుంది. దీనికి కారణం ఒత్తిడినిచ్చే హార్మోన్లు శరీరంలో పెరగటం జరుగుతుంది. కనుక ప్రతిరోజూ తగినంత సమయాన్ని నిద్రకు కేటాయించి. అవసరమైన హార్మోన్ల స్ధాయి మెయిన్టెయిన్ చేయండి.
పిల్లల సంరక్షణ - పిల్లల సంరక్షణలో మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు దిగజారవచ్చు. కాని అది మీ సెక్స్ లైఫ్ కు అడ్డంకి కారాదు. బేబీ సంరక్షణలో పడి మీ వాంఛలను మరచిపోతారు. భాగస్వామిని అశ్రద్ధ చేస్తారు. పిల్లలకు ఒక ఆయాను పెట్టటం లేదా బేబీ నిద్రించే సమయంలో పది నిమిషాల వర్కవుట్లు కానిచ్చేయటం వంటివి చేయాలి.



Click it and Unblock the Notifications



