ఆహారం విషయంలో అలసత్వం వహిస్తే పైన పేర్కొన్న సమస్యలు తప్పవంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా తీసుకునే సమతుల్యమైన ఆహారం ఆరోగ్య పోషణతో పాటు శరీర పటుత్వానికి దోహదపడుతుంట. తక్కువ మోతాదులో వేళకాని వేళలో ఆహారం తీసుకోవటం వల్ల శరీర కాంతి క్షీణించటంతో పాటు శరీర అవయువాలు ఒత్తిడికి లోనవుతాయట. ఆహారం తీసుకునే సందర్భంలో ఎటువంటి ఆందోళణకు లోనవకూడదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తప్పనిసరిగా పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అదే విధంగా చల్లగా ఉన్న పదార్ధాలను వేడిగా ఉన్న పదార్ధాలలో కలిపి ఎప్పుడు తినకూడదు.అంటే వేడి వేడి అన్నంలో చల్లటి కూరలు కలిపిగాని, చల్లటి అన్నంలో వేడి వేడి కూరులు కలుపుకుని తినకూడదు. కొత్త బియ్యంలో పాత బియ్యం కలుపి అన్నం వండకూడదు. చల్లటి నీళ్లు తాగిన వెంటనే వేడి వేడి కాఫీగాని, టీగాని తాగటం ఆరోగ్యరిత్యా నిషిద్ధం.
ఆరోగ్యానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా నియమాలను అనుసరించిన నాడే. శరీరం సహజసిద్ధమైన శక్తిని సంతరించుకుంటుని పలు అధ్యయానాలు స్పష్టం చేస్తున్నాయి.