•  

భోజనం తర్వాత వెంటనే సెక్స్ వద్దు

Time should be taken for Sex
 
భోజనం చేసిన వెంటనే సెక్స్‌లో పాల్గొనడం సరి కాదని వైద్య నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన తర్వాత కొద్ది గంటల వ్యవధి అవసరమని వారు చెబుతున్నారు. కొందరు రాత్రి ఏడుగంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి పదిగంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది.

స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే.

English summary
Experts say that Sex immediate taking food is not good. It is better to take 3 to 4 hours gap for sex after taking food.
Story first published: Thursday, March 31, 2011, 16:27 [IST]

Get Notifications from Telugu Indiansutras