ఇటువంటి వాటిలో సగమే వాస్తవంగా వుంటాయి. మరి మిగతా సగం కల్పితాలే. దురదృష్టవశాత్తూ, సరైన సమాచారం లేక చాలా మంది జంటలు విడిపోతున్నారు. వాస్తవాలు కొన్ని పరిశీలించండి.
పడకలో పడుకున్నపుడు వేరే వారి గురించి ఆలోచించటం చెడు. దీనిని పరిశీలిస్తే....రతి అనుభవం ప్రధానంగా బ్రెయిన్ లోంచి వస్తుంది కాని అవయవంలోంచికాదు. మరి బ్రెయిన్ ఎక్కడకు కావాలంటే అక్కడకు నిలకడలేకుండా పోతుంది. సంబంధాలలో కావలసింది నమ్మకంగా కట్టుబడి వుండటం. అది కనుక వుంటే...ఇక మీరు బెడ్ లో బ్రాడ్ పిట్ లేదా బిపాసా బాసు గురించి ఆలోచించుకున్నా పరవాలేదు.
రతిలో పురుషుడు స్కలన సమయంలో అంగం బయటకు తీస్తే మహిళకు సురక్షితం...నిజమా కాదా?
ఎంతమాత్రం సురక్షితంకాదు. అసలు వీర్యం ఎపుడు స్కలనం అవుతుందో పురుషులు గ్ర హించలేరు. ఏ కొద్దిపాటి వీర్యం పడినా అందులోని కణాలు ఆమెను ప్రెగ్నెంట్ చేస్తాయి.
పురుషులు ప్రతి ఏడు సెకండ్లకు సెక్స్ గురించే ఆలోచిస్తారు?
ఇది సరికాదు కల్పనే. అమెరికాలోని కిన్ సే ఇనిస్టిట్యూట్ లోనిఒక రీసెర్చి మేరకు 14 శాతం పురుషులు ప్రతిరోజూ లేదా అనేక సార్లు, 43 శాతం నెలకు కొద్దిసార్లు లేదా వారానికి ఇక 4 శాతం మాత్రం నెలకొకసారి ఆలోచిస్తారని తేలింది. అయితే మహిళలు 19 శాతం ప్రతిరోజు లేదా అనేక మార్లు, 67 శాతం నెలలో కొద్ది సార్లు లేదా వారినికి కొద్దిసార్లు, ఇక 14 శాతం కంటే తక్కువమంది నెలకొకసారి ఆలోచిస్తారట.