బెడ్ రూమ్ ఆకర్షణీయంగా వుంటే, సెక్స్ జీవితం కూడా ఆనందమయమే. ఫెంగ్ షూఇ హంగులుగల బెడ్ రూమ్ లో ప్రతి వస్తువు ప్రేమానురాగాలు ప్రతిబింబిస్తుంది.
బెడ్ రూమ్ లోని ఫెంగ్ షూయి అలంకరణలు ఆహ్లాదాన్నిమంచి ఎనర్జీని కలిగిస్తాయి. రూమ్ లో వుండాలంటే ఆనందం. కొద్ది సేపే అయినా, రాత్రాంతా నిద్రపోయినా లేక భాగస్వామితో ఆనందించినా అవి మరచిపోని క్షణాలే. బెడ్ రూమ్ ఎనర్జీలు సరిచేస్తే సంబంధాలు కూడా బాగుంటాయి. జంటలు విడిపోరు. గదిలో రంగులు, బెడ్ వేసిన స్ధలం, దాని ఇతర వస్తువుల ఏర్పాట్లు అన్నీ కూడా ప్రాధాన్యతగలవే.
బెడ్ రూమ్ కు ప్రధానంగా....
మంచి గాలి వెలుతురు - గది కిటికీలు తరచుగా తెరవండి. గాలి చెడుగా వుంటే మంచి ఫెంగ్ షూయి వుండదు. బెడ్ రూమ్ పెద్దదైతే తప్ప దానిలో మొక్కల కుండీలు పెట్టకండి. తాజాగాలి ప్రవాహం బాగా వుండాలి. బెడ్ రూమ్ లైటింగ్ వివిధ స్ధాయిలలో వుండాలి. ఒక టేబుల్ ల్యాంప్. గోడలకు కొన్ని బల్బులు వుంటే బాగుంటుంది. బెడ్ రూమ్ లో సువాసనలు వెదజల్లే కేండిల్స్ కూడా పెట్టవచ్చు.
ఎలక్ట్రానిక్స్ పరికరాలు - టి.వి, కంప్యూటర్, వ్యాయామ పరికరాలు వంటివి బెడ్ రూమ్ లో వుంచకండి. ఫెంగ్ షూయి ఎనర్జీ తగ్గిపోతుంది.
రంగు రంగులు - కంటికి ఇంపైన రంగులు వేస్తే ఫెంగ్ షూయి ఎనర్జీ బాగుంటుంది. పేల్ వైట్ నుండి చాక్లెట్ బ్రౌన్ వరకు ఫెంగ్ షూఇ కి అనుకూలమైన రంగులే. బెడ్ రూమ్ అలంకరణకు సరిపోయే రంగులు వీటి మధ్య ఎంచుకోండి.
ఫొటోలు - ఫెంగ్ షూఇ ఎనర్జీకి వీటికి బాగా సంబందం వుంది. వీటి ఎంపికలో చాలా జాగ్రత్త కావాలి. మీరు ఎంతో కావాలనుకునే ఆర్ట్ పెయింటింగ్స్ పెట్టండి. విచారకరమైనవి, ఒంటరి గా వుండే బొమ్మలు పెట్టకండి.
రాత్రివేళ - రాత్రి సమయంలో బెడ్ రూమ్ తలుపులన్నీ వేసేయండి. బాత్ రూమ్ డోర్ కూడా పూర్తిగా వేయండి. ఇక చక్కటి ఎనర్జీ గదిలో మీ మధ్యగల సంబంధాలలో ప్రవహిస్తుంది.
బెడ్ ఎలా వుండాలి - రెండు పక్కలనుండి బెడ్ ఎక్కేలా వుండాలి. డోర్ కు ఎదురుగా వేయవద్దు. ఆకర్షణీయంగా వుండాలి. మంచి మేట్రస్, గట్టి హెడ్ బోర్డు, నాణ్యతగల బెడ్ షీట్లు మొదలైనవి మంచి ఫెంగ్ షూఇ ఎనర్జీ ప్రవహింపజేస్తాయి.