•  

సెక్సు ఆనందానికి సప్త స్వరాలు!

7 points guide to Sexual Bliss
 
సెక్సు ఆనందం అంతం అయ్యిందా? డైలీ ఒకే రకమైన సెక్సు బోర్ కొట్టేస్తోందా? మేము దిగువ సూచించే సూచనలు పాటించండి. పూర్తిగా రీ ఛార్జ్ అవ్వండి.

1. సెక్స్ రొటీన్ మార్చెయ్యండి. సెక్స్ రొటీన్ ను విశ్లేషించండి. త్వరిత భావప్రాప్తి కొరకు ప్రయత్నిస్తున్నారా? అలాగయితే, మీకు అసంతృప్తే. మీరు ఇపుడు చేస్తున్న సెక్స్ విధానానికి పూర్తి వ్యతిరేకం చేయండి. రాత్రిపూట చీకటిలో లైంగిక చర్యలా? మార్చండి. ఉదయం లేదా మధ్యాహ్నం చేయండి. ఎపుడూ బెడ్ రూమ్ లోనేనా? కిచెన్ లేదా బాత్ రూమ్ లలో ప్రయత్నించండి. మీ మగవాడు ఎపుడూ పైనేనా? అతనికో సర్ ప్రైజ్ ఇస్తూ మీరు పై పొజిషన్ కు రండి. సెక్స్ చర్యలలో కొత్త రకాలు, భంగిమలు ఆచరించండి.

2. మీ రూపం కొద్దిపాటి సెక్సీగా వుండేలా భాగస్వామిని ఆకర్షించండి. ఎపుడూ వేసుకునే దుస్తులు భిన్నంగా ధరించండి. అతనికి వెంటనే కోరిక కలిగేలా చేయండి. ఇంట్లో చిన్నపాటి దుస్తులు వేసుకుని ఎత్తులో వున్న బూజులు లేదా దుమ్ము దులపండి.

3. రతి క్రీడను కొద్ది సమయంలో ముగించేయవద్దు. సమయం తీసుకోండి. దినమంతా భాగస్వామికి సెక్స్ కోరికలు కలిగే టెలిఫోన్ కాల్స్ లేదా మెసేజీలు పంపండి. ముందస్తు ప్లానులు మీకు తప్పక ఆనందాన్ని కలిగిస్తాయి.

4. ఒక్క సారి గతంలోకి వెళ్ళండి. రాత్రనకా, పగలనకా మీ భాగస్వామితో కొత్తలో చేసుకున్న మొదటి చర్యలను గుర్తుకు తెచ్చుకోండి. అదే రకంగా చక్కటి విందులు, వినోదాలు మరోమారు రిపీట్ చేసుకోండి. కొత్తలలో పిలుచుకున్న పిలుపులు, జోకులు, మ్యూజిక్, డాన్స్ అన్నీ మీకు మంచి ఉత్తేజాన్నిస్తాయి.

5. పడుకునేటపుడు కోపమంతా మనసులో వుంచుకొని పడుకోవద్దు. బయటకు మాట్లాడేయండి, నిజాయతీగా వుండండి. ఒకరిలో మరి ఒకరికి నచ్చని అంశాలు తెలుపుకోండి. సరిదిద్దుకోండి. అయితే మంచి గుణాలు కూడా చర్చించుకోండి. అసలు ఒకరంటే మరి ఒకరు ఎందుకిష్టపడ్డారో వ్యక్తం చేసుకోండి.

6. ఒకరంటే ఒకరికి అమితంగా ఇష్టపడటానికి ఇద్దరి మధ్యా ఏదో ఒక రహస్యం వుంటుంది. ఎనలేని ఆ ప్రేమకు కారణం లేదా ఆ మిస్టరీని అలానే వుండనివ్వండి. మీ మధ్య సంబంధాన్ని మరింత బలపరచుకోండి.

7. చివరగా మీ బెడ్ రూమ్ అనబడే రతి క్రీడా సామ్రాజ్యాన్ని ఉత్తేజ భరిత అలంకరణలతో నింపేయండి. ఎక్కడ చూసినా సిల్క్ కర్టెన్లు, శాటిన్ బెడ్ షీట్స్, సెక్స్ భరిత రంగులు. వినసొంపైన లేదా ఉత్తేజాన్నిచ్చే మ్యూజిక్ లేదా ప్రోత్సహించే టివి ఛానెల్ అమర్చుకోండి. షీలా కి జవానీ....అంటూ పాట పాడేయండి. నోరూరించే వంటకాలను ఒకరికొకరు షేర్ చేసుకోండి. సువాసనలు వెదజల్లే నీటితో బాత్ రూమ్ స్నానాలు చేయండి. అన్ని రకాలుగా ఆస్వాదించే చర్యలు మరోమారు మీ జీవితంలో నూతనోత్సాహాన్ని నింపుతాయి.

English summary
Turn your bedroom into an erotic boudoir by adding loads of silk, satin sheets and colours that make you feel sexy. Cook aphrodisiacal meals together with naughty ingredients that really s-excite the taste buds, or share a candlelit bath with fragrant bubbles and scented oils. Make the time to indulge your senses and you'll soon your libido replenished.
Story first published: Thursday, August 11, 2011, 8:15 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more