అప్పటి వరకు తాను పుట్టి, పెరిగిన కుటుంబ పరిస్థితులు, ఇంటి మార్పు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు - ఇలా అనేక విషయాలు భార్యను భయపెడుతూ ఉంటాయి. ఆందోళనకు గురి చేస్తూ ఉటాయి. దీంతో ఆమె సెక్స్ పట్ల విముఖత చూపుతుంది. ఇదే అయిష్టతను భర్త పట్ల కూడా చూపుతారు. ఇలాంటి సమయాల్లో భార్య మనస్సెరిగి నడుచుకోవడం మంచిదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. ముఖ్యంగా, కొంత కాలం సెక్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా భార్యను శృంగారానికి ప్రోత్సహించేలా నడుచుకోవడం మంచిదని చెపుతున్నారు. ముఖ్యంగా భార్యకు సంతోషం కలిగించే పనులు చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆమె మనస్సును మార్చి సెక్స్ పట్ల ఆకర్షితురాలయ్యేలా చేయవచ్చునని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.
పెళ్లయిన కొత్తలో పడకగదిలోకి చేరగానే భార్యను ఆక్రమించుకుని తనవితీరా అనుభవించడానికి పురుషుడు తహతహలాడుతుంటాడు. స్త్రీలు మాత్రం భయంతో, సిగ్గుతో కుంచించుకుపోతారు. దీంతో భర్తను పక్కకు కూడా రానివ్వరు. అదే సమయంలో భర్త ఎలాగైనా తన శోభనం రాత్రి ఓ మరిచిపోలేని తీపి గుర్తుగా మిగిలిపోవాలని ఆరాటపడుతుంటాడు. భర్త వెంటనే రెచ్చిపోవడానికి ప్రయత్నించకుండా పెళ్లయిన కొత్తలో భార్యలు సెక్స్ పట్ల విముఖత ప్రదర్శించడానికి గల కారణాలను భర్త తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.