•  

ఉదయపు రతిక్రీడ - మంచి సమయమే!

Morning Lovemaking: Best Time To Make Love!
 
ఉదయం వేళ లేచిన వెంటనే భార్యాభర్తలు రతిక్రీడలాచరిస్తే సమర్ధవంతంగా వుంటుంది. రోజు... చక్కటి రొమాన్స్ తో మొదలై ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. పురుషులకు ఉదయంవేళ మంచి శక్తి వుంటుంది. అంగస్తంభన బాగా వుంటుంది. మైండ్ విశ్రాంతిగా కూడా వుంటుంది.

1. ఉదయంపూట చేసే రతిలో రాత్రి పూట వుండేటంత కోరిక వుండదు. రోజులో చేయాల్సిన పనుల జాబితా ఒకవైపు వేధిస్తూండటంతో ఎక్కువ సమయం రతిక్రీడకు కేటాయించలేకపోతారు. ఫోర్ ప్లే, కేండిల్స్, మూడ్ తెచ్చుకోవటం లాంటివాటికి అవకాశముండదు. అయినప్పటికి ఉదయ రతిక్రీడలో కొన్ని ప్రయోజనాలున్నాయి.

2. పురుషులు ఉదయంలో అంగస్తంభన బాగా కలిగి వుంటారు కాబట్టి వారికి మూడ్ త్వరగానే వస్తుంది. కాని మహిళలకు రాదు. లేస్తూనే వారు ఉద్రేకపడరు. కనుక పురుషులు తమ వంతుగా కొద్దిపాటి ప్రయత్నం చేసి మహిళను ప్రోత్సహించాలి.

3. ముందురాత్రే సిద్ధం అవండి. భాగస్వామిని ఆశ్చర్యపరచండి. బెడ్ పక్కనే కండోమ్ లు పెట్టుకోండి. ఉదయంపూట నోరు దుర్వాసన రాకుండా కొన్ని మౌత్ ఫ్రెషనర్స్ కూడా వుంచండి.

4. అవసరమనుకుంటే ఉదయం వేళ అలారం పెట్టుకొని లేవండి. ఇది సమయం వృధా కాకుండా చేస్తుంది.

5. స్త్రీ కంటే కూడా ముందుగా పురుషుడు నిద్ర లేస్తే మంచిది. రతిక్రీడకు ఆమెను కొంత సిద్ధం చేయవచ్చు.

6. మహిళలు త్వరగా ఉద్రేకపడరు కనుక మెల్లగా మొదలుపెట్టండి. వారు కొంత సమయం తీసుకుంటారు. ముద్దులు పెట్టండి, ఆలింగనం చేయండి, శరీరం స్పర్శించండి రతిక్రీడ మూడ్ వారికి తెప్పించండి.

7. ఈ సమయంలో మీ స్త్రీ లో వుండే లోటు పాట్లు అంటే దువ్వని తల, వాసన కొట్టే నోరు మొదలైనవి పట్టించుకోకండి. మీకు ఆమె కావాలనేలా ప్రవర్తించండి.

8. ఈ సమయంలో స్పూన్ పొజిషన్ లేదా మహిళ పైన పరుండే పొజిషన్ తో రతినాచరించండి. లేదా వీలైనంతవరకు ఒకరి వెనుక మరి ఒకరుగా వుండే పొజిషన్ అయితే మంచిది.

9. మొదటి రతి లోనే పురుషులు క్లైమాక్స్ చేరిపోతారు. కనుక మరోమారు ఇద్దరూ కలసి బాత్ రూమ్ స్నానం చేస్తే మరింత మజా కాగలదు.

English summary
Morning lovemaking is believed to be the best session for couples. The day starts off with romance and also increases the energy levels. Most of the men get up with morning erection and the urge to make love in the morning makes the couple spend some quality time together before starting the day. Even after morning breath and no decked-up look, couples get into morning love. It relaxes the mind and brightens the day. Lets check out few tips for morning lovemaking.
Story first published: Tuesday, October 4, 2011, 10:28 [IST]

Get Notifications from Telugu Indiansutras