భర్త తన సోషల్ లైఫ్ లోని స్నేహితులకు, ఇతర దంపతులకు డిన్నర్ పార్టీలు ఇవ్వటాన్ని భార్యలు నిరుత్సాహపరచి వాటిని తగ్గించేస్తూ వుంటే అతని పురుషాధికారం దెబ్బ తింటుందని, ఫలితంగా అతను తన భార్యతో కూడా వివాహ జీవితంలో సరిగా వుండడని సైంటిస్టులు చెపుతున్నారు.
భర్తకు వున్న స్నేహితులనందరిని తగ్గించివేస్తే అతని సోషల్ లైఫ్ నిరాసక్తమై ప్రమాదకర పరిస్ధితికి దోవతీస్తుంది.
భార్య, తన భర్త ఇచ్చే పార్టీలను ఈ విధంగా అడ్డగించటమనేది అతని పురుషాహంకారానికి గొడ్డలిపెట్టై మానసికంగా బయటకు చెప్పలేని కష్టాలలో పడతాడని, ఆ భావనలు పార్టీలు అడ్డగించిన భార్యపై ప్రభావం చూపుతాయని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ కార్నెల్ తెలిపారు.
ఇక్కడ అంశం ఏమంటే, అతని పరిచయాలను తగ్గించేయటం, లేదా తన ఆధిపత్యం పెంచుకోటం కాదని ఆమె అతనికి స్నేహితుల విందులు, వినోదాలను లేకుండా చేయటం జరిగిందనేది ప్రధానమని, పురుషుడు పబ్లిక్ లో తాను ఒక రౌండ్ గోల్ఫ్ ఆడేయటంలోను, స్నేహితులతో డ్రింకులు తీసుకోవడంలోను కూడా తన ఆధిక్యత ప్రదర్శించుకోడానికి ఇష్ట పడతాడని, తాజాగా వచ్చిన భార్య పాత్ర ఇందులో వాటిని చూడటం వరకు మాత్రమేగా వుండాలని అతను కోరుకుంటాడని, అతని ఈ చర్య తన దైనందిన జీవితంలో ఒక స్వతంత్రత కలిగి వున్న భావన కలిగిస్తుందని, ఈ ప్రొఫెసర్ వివరించారు. ఇక ప్రతి సందర్భానికి అతను తన భార్యను తీసుకు రావాలన్నా లేక తనతో వచ్చిన భార్య అతని స్నేహితులపై ఆధిక్యత ప్రదర్శిస్తున్నా సమస్యలు వచ్చి తీరతాయంటున్నారు.
రీసెర్చర్లు చికాగో పట్టణంలో సుమారు 3000 మంది జంటలపై తమ ఈ పరిశోధన చేసి ఫలితాలను వెల్లడించారు. వారు చేసిన ఈ పరిశోధనా గ్రూపులో తమ భార్యలు పార్టీలు అడ్డగిస్తున్న భర్తలలో మగతనాలు లోపించి రతిక్రీడలు కూడా సరిగా జరుపలేని పరిస్ధితి ఏర్పడుతున్నట్లుగా కూడా రీసెర్చర్లు వెల్లడి చేశారు. కనుక భార్యలు తమ వైవాహిక జీవితం సంతృప్తిగా సాగాలన్నా, తాము సరైన పడక సుఖం పొందాలన్నా, భర్తలు తమ స్నేహితుల లేదా కార్యాలయాల పరిధిలో అవసరంగానో లేక అనవసరంగానో ఇచ్చే పార్టీలకు భార్యలు అడ్డు చెప్పక, ప్రోత్సహిస్తూ వుంటే వారి మధ్య సమస్యలు తలెత్తవు కదా...మంచి అన్యోన్యత కూడా ఏర్పడగలదు.