•  

మాయమవుతున్న భార్యాభర్తల సెక్స్ వాంఛలు!

<ul id="pagination-digg"><li class="next"><a href="/lifestyle/kamasutra/2011/sex-the-country-150911-aid0181.html">Next »</a></li></ul>

Where has the Sex gone?
 
పడక గదులు నిశ్శబ్దాన్ని ఆవరించుకొని బోసిపోతున్నాయి. ప్రేమపక్షుల నోళ్ళు మూగబోయాయి.తేనెటీగలు ధ్వని నిలిపేశాయి. నగ్న సత్యం చెప్పాలంటే పడకగదుల్లో భారతీయ కొత్త దంపతుల మధ్య కామక్రీడల సంక్షోభం ఏర్పడింది. లైంగిక చర్యల కొరత తీవ్రంగా వుంది. ఎవరిని నిందించాలి? సెక్సు సుఖాలను దూరంగా పారద్రోలిన నగర జీవన శైలినా? పని ఒత్తిడి, ఇంటి సమస్యలు, సమయం కొరత, ప్రయివసీ లేకపోవడం, పనిలో అసమతుల్యత, ఇంటి చాకిరి, పిల్లలు, అన్ని చేరి భార్యాభర్తల సెక్స్ కోరికలను అణచి వేస్తున్నాయి - అంటున్నారు ప్రముఖ సెక్సాలజిస్టు డా. ప్రకాష్ కొఠారి.

ముంబై నగర జీవనంలో 39 సంవత్సరాల వయసున్న మహిళ, ఇద్దరు పిల్లల తల్లి జ్ఞాపకాలు పరిశీలిస్తే -సెక్స్ ఎప్పుడు ఆచరించానో తెలియదు. బహుశ నా రెండో బిడ్డ పుట్టినపుడే కాబోలు అని జోక్ చేస్తుంది. మాకు సెక్స్ వాంఛ లేక కాదు, కామోద్రేకం కలగక కాదు. భార్యా భర్తలమైన మేమిరువురమూ ఉద్యోగ వ్యాపారాలలో ఎంతో బీజీ. ఇక అర్ధరాత్రి ఇంటికి చేరి పడకగది దుప్పట్లో దూరే సరికి పగలంతా శ్రమించిన శరీరంలోని హార్మోన్లు సహకరించడం లేదు. రతిక్రీడ చేయాలని ఆసక్తి వున్నప్పటికి శరీర మాంసం బలహీనపడిన కేసులు ఇవి.

సమయం దొరకక, అలసి కొందరైతే మరి కొందరు డిప్రెషన్, ఆవేదనలకు గురై సెక్స్ కార్యంలో భంగపడేవారున్నారు. ఇవన్ని సెక్స్ చర్యను వెనకేస్తున్నాయని సైకాలజిస్ట్ సీమా చెపుతారు.
సెక్స్ లో తమకు పూర్తిగా ఆసక్తి పోయిందని తెలిపే భార్యా భర్తల కేసు కనీసం ఒకటైనా రోజుకు వస్తూంటుందని ఈమె చెపుతారు. వీరితో మరింత లోతుకు వెళితే, ఆర్ధిక ఇబ్బందులతో డిప్రెషన్, ఆందోళనలు కారణంగా కూడా చెపుతారు. నేటి రోజుల్లో చాలామంది తల్లులు తమ పిల్లలే ధ్యేయంగా జీవిస్తూ వారి సెక్స్ ఆనందాన్ని కోల్పోతున్నారు. పెళ్ళైన కొత్తల్లో లైంగిక చర్యలు బాగానే జరుగుతాయి. కాని సంవత్సరం గడిస్తే చాలు కోరికలు మరుగున పడతాయి. కారణం - సొంత ఇంటి ఆరాటం, తండ్రి అయిన భాధ్యత. కుటుంబ పోషణ అన్ని చేరి మగాడిని నగర జీవనంలో నపుంసకుడ్ని చేస్తున్నాయి.

<ul id="pagination-digg"><li class="next"><a href="/lifestyle/kamasutra/2011/sex-the-country-150911-aid0181.html">Next »</a></li></ul>

English summary
"I see at least one case every day where the man or woman confesses that they've lost all interest in sex, or complain that they hardly have it. During the counseling sessions that follow, I invariably find that one of them is suffering from depression or anxiety, which could stem from loneliness and the empty nest syndrome to a lack of selfworth or financial losses. Also, I see many mothers' lives these days solely centred around their kids, so much so that somewhere along the way, they forget to seek pleasure for themselves," she says.
Story first published: Thursday, September 15, 2011, 13:16 [IST]

Get Notifications from Telugu Indiansutras