•  

ఐ లవ్ యూ....చెప్పాలంటే?

Express
 
పురుషులు వారు భావించేదాన్ని సరిగా వెల్లడి చేయలేరని మహిళలు అనుకుంటారు. సంబంధాలు బలపడాలంటే మీ భావనలు తెలుపటం అవసరం. మహిళ మాత్రం తన భావాలను తేలికగా వెల్లడి చేయగలదు. తాను ఆశించింది పురుషుడి నుండి పొందలేకపోతే కుంగిపోతుంది, అనవసరంగా భావిస్తుంది. మీరు ప్రేమించే మహిళకు మీ భావాలను తెలుపాలనుకుంటున్నారా? ఆమెతో చక్కటి సంబంధం కొనసాగించాలనుకుంటున్నారా.? ఏం చేయాలో చూడండి.

వ్రాయండి - ఒక మహిళకు 'ఐ లవ్ యూ' అని చెప్పాలంటే....ఒక కాగితంపై రాసి టేబుల్ పై పెట్టండి. లేదా ఫ్రిజ్ పై అంటించండి. మహిళ హృదయం క్షణాలలో కరిగిపోతుంది.

బహుమతినివ్వండి - మహిళకు మీ భావాలను తెలుపాలంటే, ఆమె ఇష్టమేదో తెలుసుకొని దానిని బహుమతిగా ఇవ్వండి. మాటల మధ్యలో అప్పటివరకు దాచివుంచిన బహుమతి ఆమె ముందుంచండి. ఇంకా రొమాంటిక్ అంటే...ఆమె కళ్ళు మూయండి...గిఫ్ట్ ఆమె ముందుంచండి.

లవ్ - శారీరక స్పర్శలు మహిళతో మీ ప్రేమను బలపరుస్తాయి. ప్రేమ కురిపించండి. ఆమె మీకు చాలా ముఖ్యురాలని చెపపండి. ఆఫీసుకి వెళుతున్నారా ? ఆమెకు చిన్న ముద్దు ఇచ్చి వెళ్ళిపొండి. చాలా సంతోష పడుతుంది.

బయటకు తీసుకు వెళ్ళండి - మీ ప్రేమ, అనురాగం తెలుపాలంటే కొంత సమయం ఆమెతో గడపండి. రెస్టరెంట్ లో డిన్నర్ వంటివి ఆఫర్ చేయండి. లేదా రిసార్ట్ లో వెకేషన్ గడిపి మీ ప్రేమ వెల్లడించండి.

రొమాన్స్ - సంబంధాలలో ప్రధానమైంది రొమాన్స్. మీరు చెప్పాలనుకున్న మాటలన్నీ ఆమెకో రొమాంటిక్ టచ్ ఇస్తే చాలు....ఆమెకు ఎంతో సంతోషం కలుగుతుంది. రతిక్రీడలాడి బోర్ కొడితే....ఇక రొమాన్స్ మొదలెట్టండి. ఆనందించండి.English summary
Women often feel that men are not expressive and they can't explain what they feel. Expressing your feelings is very important as a relationship becomes more strong that way. Generally a woman expresses her feelings easily and when she doesn't get the same from her man, she feels depressed and unwanted. For a man, it is very difficult to express their love for woman.
Story first published: Monday, November 21, 2011, 12:15 [IST]

Get Notifications from Telugu Indiansutras