కాని నేటి పరిస్ధితి.....తల్లితండ్రులకు అగ్నిపరీక్షే అయింది. ఇంటిపట్టున వుండే సౌకర్యాలన్నీ వదిలేసి నేటి యువతీ యువకులు అధిక సంపాదనలనాశిస్తూ, హయ్యర్ స్టడీస్ పేరుతో ప్రపంచంలోని ఇతర దేశాలకు అడుగు పెడుతున్నారు. తమ నగరాలు వదిలి ఇతర నగరాలకు, పట్టణాలకు పరుగులుపెడుతున్నారు. ఇక వీరికి అడ్డూ ఆపూ లేని సమాచారం పుస్తకాలు, మేగజైన్లు, సినిమాలు, పెయింటింగ్ లు, ఇంటర్నెట్ లు, ఫేస్ బుక్ లు మొదలైనవాటి ద్వారా వారి మైండ్లకు వచ్చి చేరుతోంది. ఇంట్లో వారి నియంత్రణ లేకపోవటం, నాలెడ్జి అన్న పేరుతో కుప్పతెప్పలుగా వచ్చిపడే సమాచారం యువతీ యువకులను వారి వయసుకంటే పది రెట్ల అనుభవాల్ని తెచ్చిపెడుతోంది. వారు పరిపక్వమయ్యామనుకుంటున్నారు. పరిపక్వతకు వయసుకు సంబందం లేదు. పరిపక్వత అనేది అతి చిన్న వయసులోనూ రావచ్చు. లేదా 90 ఏళ్ళకు కూడా రావచ్చు. కావలసినదేమంటే, సరి అయిన పని సరి అయిన వయసులో చేయటం కావాలి. అది కూడా సరైన వ్యక్తితో సుమా! చేయటం సరిగా వున్నంతవరకు సాంప్రదాయాలను పాటిస్తున్నామా? లేక కొత్త కల్చర్ సృష్టిస్తున్నామా అన్న సమస్యే లేదు. తల్లితండ్రులు సెక్స్ ను చెడుగా భావించక, నియాజతీగాను నిస్సంకోచంగాను వుంటే కొన్ని పరిస్ధితులలో బహుశ యువతీ యువకులు సరిగ్గానే వ్యవహరించగలరేమో.
పెళ్ళికి ముందే సెక్స్ అంటే రెండు శరీరాల కలయిక. కొత్త తరం యువతీ యువకులు మొదటగా రతి క్రీడలు ఆనందించేస్తున్నారు. ఆపై వివాహానికి ఆనందంగా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. బహుశ వారి స్టడీ పూర్తయ్యేటంతవరకు, లేదా మంచి సంపాదన కల జాబ్ వచ్చేటంతవరకు. చక్కని భవిష్యత్తుపై కలిసివుంటామని వారికి విశ్వాసముంది. వేచి వుండాలంటే వారికి అభ్యంతరం లేదు.
సెక్స్ అనేది లోపలినుండి బయటకు వచ్చే ఒక కోరిక. వివిధ రూపాలలో మార్గాలు వెతుక్కునే జంటలకుఅది ఎప్పుడూ వుంటూనే వుంటుంది. ఆకలిగా వున్నపుడు కొంతమంది ఏది కనపడితే అది తింటారు. కాని కొంతమంది సరైన ఆహారం కొరకు వేచి వుంటారు. మరి కొంతమంది తమ ఆకలినుండి తమ దృష్టి మళ్ళించుకోడానికి సంగీతంపై మనసు పెడతారు.
వివాహానికి ముందే రతిక్రీడ లాచరించడం తప్పా? ఒప్పా ? అనే చర్చ కాదు ఇది. శారీరక స్నేహం ప్రేమకు ఒక సహజ ప్రదర్శన. ఇక ఈ అంశంలో జోక్యం వున్న ఇద్ధరూ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాగలదు. ఎంత వాదించుకున్నప్పటికి, మనం పెళ్ళి అంశం వచ్చేటప్పటికి అప్పటివరకు ఎవరితోనూ తిరగని పవిత్రమైన కన్య కావాలంటాం! గతంలో వివాహమనే భావనకు నేటి వివాహామనే భావనకు అర్ధం మారిపోయింది. ఒక ప్రణాళిక లేదు. కాని నేటి కాలంలో ఎవరూ కూడా వివాహ వ్యవస్ధలోని పవిత్ర భావాన్ని అందులో వున్న సుఖాన్ని అర్ధం చేసుకోలేకుండా వున్నారు.
నేటి యువతీ యువకులది వేగవంతమైన కారు ప్రయాణం. ఈ ప్రయాణంలో నైతిక విలువలు కారు చక్రాలకిందపడి నలిగిపోతున్నాయి. ప్రయాణం చేయటమే....టెస్ట్ డ్రైవింగ్ కూడా వీరికి అవసరంలేదు.