వారానికి మూడు సార్లు రతిక్రీడను ఆచరిస్తే, అనేక కేలరీలు ఖర్చు చేయబడతాయి. ఇక జీవితమంతా చేసే రతి క్రీడ 75 మైళ్ళ జోగింగ్ కు సమానమని అంచనా వేయబడింది. ఒక్కసారి గట్టిగా ఆచరించే రతిక్రీడ 200 కేలరీలను ఖర్చు చేస్తుంది. అంటే సుమారు 15 నిమిషాలు ట్రెడ్ మిల్లుపై వ్యాయామం చేసినట్లే. రతిక్రీడ రెగ్యులర్ చేస్తూపోతే చక్కటి రక్తప్రసరణ కొల్లెస్టరాల్ మంచి స్ధాయికి రావడం మొదలైన ప్రయోజనాలే కాక మీలో వ్యాధి నిరోధక వ్యవస్ధను కూడా అభివృద్ధి చేస్తుంది. చురుకుగా రతిక్రీడ చేసేవారి జీవితాలు మరింత దీర్ఘకాలం సాగుతాయని రీసెర్చి చెపుతోంది. శరీరంలో అవయవాలు, ఇతర భాగాలు చక్కగా పని చేసి ఆరోగ్యంగా వుండగలరని దీనితో వివిధ అవయవాలలోని కణాలు శక్తివంతంగా వుంటాయని, కొల్లెస్టరాల్, లేదా గుండె జబ్బు లు రాకుండా దివ్యమైన ఔషధంలా కూడా పని చేస్తుందని రీసెర్చి చెపుతోంది. ఆరోగ్యకరమైన రతిక్రీడ చెడు కొల్లెస్టరాల్, మంచి కొల్లెస్టరాల్ ల మధ్య సమతుల్యతను తెస్తుంది. పురుషులు తమ గుండె జబ్బుల రిస్కును 50 శాతానికి తగ్గించుకోగలరు.
అంతేకాదు, శరీరంలో వున్న నొప్పులు కూడా రతిక్రీడతో తగ్గి సుఖంగా వుంటుంది. కీళ్ళ నొప్పులకు మంచి ఔషధం. మెడికల్ భాషలో చెప్పాలంటే రతిక్రీడలో హార్మోన్ ఆక్సీటోసిన్ స్ధాయిలు సాధారణం కంటే అయిదు రెట్ల స్ధాయికి పెరుగుతాయి. దీని కారణంగా ఎండోర్ఫిన్లు విడుదల అయి శరీరంలోని తలనొప్పి నుండి, కీళ్ళనొప్పులనుండి మైగ్రేన్ తలనొప్పి వరకు తగ్గించేస్తాయి. కనుక, తలనొప్పి లేదా మైగ్రేన్ వచ్చినపుడు మందుకు బదులు భాగస్వామితో జతకూడండి. రతిక్రీడ మరో ప్రయోజనం ప్రొస్టేటు గ్రంధిలోని సమస్యలు మాయమవుతాయి. ప్రొస్టేటు చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
నేటి జీవితాలు ఒత్తిడితో కూడినవి. రతిక్రీడ ఒత్తిడితగ్గించే దివ్యమైన ఔషధం. క్రీడ తర్వాత మైండ్, రక్తప్రసరణ ఎంతో మెరుగుపడతాయి. ఆందోళనలు దూరమవుతాయి. 1997 లో చేసిన పరిశోధనలలో తరచుగా రతిక్రీడలను ఆచరించే వారు అధిక కాలం జీవించినట్లుగా కూడా తేలింది. తరచుగా చేసే రతిక్రీడ మహిళలలో హార్మోన్ల స్ధాయిని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. యోని ద్వారాన్ని మెత్తగా వుంచుతుంది. ఈస్త్రోజన్ ఉత్పత్తి అయి రుతు క్రమం సరిగా వస్తుంది. అంతే కాదు అన్నిటికి మించి పొట్ట నడుము మొదలైన భాగాలు చక్కటి రూపాన్ని సంతరించుకుంటాయి.
రతిక్రీడ చాలా సామాన్య చర్యగా భావించినప్పటికి దాని వెనుక గల ప్రయోజనాలు అపరిమితం. వేల సంవత్సరాల క్రిందటే నేడు మనం కనుగొన్న రతిక్రీడ సామర్ధ్యాలను వినియోగించి ఎంతో అధిక స్ధాయి అవగాహనాప్రయోజనాలను పొందినట్లు తెలుస్తోంది. వారానికి మూడు సార్లు రతి చేయండి అంటే....ఏదో సాధారణంగా చేసేయడం కాదు. ఇలా చేయడం మరింత ఒత్తిడి, ఆందోళన ఇతర లైంగిక వ్యాధులకు కూడా దోవతీస్తుంది. కనుక రతిక్రీడను పూర్తి సమర్ధతలతో చక్కటి వాతావరణంలో మంచి భాగస్వామితో కలసి ఆనందించటం అధిక ప్రయోజనాలను కలిగిస్తుంది.