బిడ్డ జన్మించటం తల్లి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొత్తగా తల్లి అయిన మహిళ డెలివరీ తర్వాత కొన్ని నెలలపాటు అలసట కలిగి వుంటుంది. కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది కనుక రతి క్రీడపై ఆసక్తి చూపదు. తల్లి కనుక బిడ్డపుట్టిన తర్వాత మానసిక వేదనలో పడితే...ఇక వాస్తవంలోకి రావటం కష్టమే! ఇక మళ్ళీ ఆమెను లైంగిక చర్యలకు దింపటం కష్టమే. బేబీ కుటుంబంలోకి కొత్తగా రావటంతో తల్లితండ్రులకు భాధ్యత మరింత పెరిగి వారేదో పెద్ద బరువును మోస్తున్నట్లు భావిస్తూ సెక్స్ జోలికి పోరు. మరో విషయంగా బేబీ పడుకునేందుకు ఖచ్చితమైన సమయం అంటూ వుండదు. ఏడవటం, అల్లరి చేయటం వంటి వాటితో తల్లితండ్రులు కూడా సతమతమై అలసి రతిక్రీడపై ఆసక్తి తగ్గించుకుంటారు. బేబీపై పూర్తి శ్రధ్ధ చూపాలి కనుక రతిక్రీడకు అంతరాయం కలుగుతూనే వుంటుంది. అయితే, ఈ క్రింది సూచనలు పాటిస్తే బహుశ మీకు అంతరాయం కలగకపోవచ్చు. ప్రయత్నించండి!
మరోమారు మహిళకు రతిక్రీడపట్ల ఆసక్తి కలిగించటమెలా?
ప్రెగ్నెన్సీ తర్వాత మహిళకు రతిపై ఆసక్తి తగ్గుతుంది. ఇక ఆసమయంలో పురుషుడే చురుకుగా వ్యవహరించాలి. సువాసనలు వెదజల్లే స్నానాలు, కేండిల్ లైట్ డిన్నర్లు, ఆయిల్ మాసేజీలు మొదలైనవి ఆమెకు బేబీ పుట్టిన తర్వాత ఆసక్తిని కలిగించే అవకాశాలున్నాయి.
తల్లికి కనుక సిజేరియన్ ఆపరేషన్ జరిగితే ఆ సమయంలో ఆనందానికి సంబంధించిన కొన్ని శాశ్వత గుర్తులు పడితే అవన్ని ఆమెకు మరింత శాశ్వత బాధ మిగులుతుంది. ఆ సమయంలో పురుషుడు చురుకుగా వ్యవహరించి ఆమెకు ఆనందం కావాలని కోరిక కలిగేలా చేయాలి. బేబీ పుట్టక ముందు తన భర్త తనను ఏ రకంగా కోరాడో ఇపుడు కూడా అదే రకంగా కోరుతున్నాడన్న భావన ఆమెకు కలిగించేలా పురుషుడు చేయాలి. డెలివరీ తర్వాత మహిళ సాధారణంగా కొంత బరువు పెరుగుతుంది. దీంతో ఆమెకై ఆమెకే అసౌకర్యంగా కూడా వుంటుంది. రతిక్రీడ కొంత శారీరక శ్రమకు సంబంధించినది. దాంతో ఆమెకు కష్టంగా కూడా తోస్తుంది. అటువంటపుడు ఆమెకు అనుకూలమైన రతి భంగిమ ఆచరిస్తే ఆమె కొంత మేరకు బరువు తగ్గినట్లు భావిస్తుంది.
సాధారణంగా డెలివరీ తర్వాత చేసుకునే రతిక్రీడలు గతంలో అంత ఉద్రేకంగా కూడా వుండవు. ఇపుడు మీరు తల్లి తండ్రులు. చేసే పనులన్నిటికి ఇక ఒక పద్ధతి ఏర్పడుతుంది. ఈ మేరకు లైంగిక చర్యలు జరిపినప్పటికి ఏ మాత్రం హాని కలగదని ఆమెను ఒప్పించాలి. గతంలో ఒంటరిగా వున్నపుడు చేసుకున్న భీభత్స రతిక్రీడలకంటే కూడా తల్లితండ్రులుగా ఒక పద్ధతిలో ఆచరించే రతిక్రీడలు ఇద్దరికి మరింత ఆనందాన్ని కలిగిస్తాయి.
భార్యా భర్తలు మంచి అవగాహన, ప్రేమల ఆధారంగా చేసే శృంగారం బిడ్డ పుట్టినప్పటికి ఎంతో మధురంగాను, హాయిగాను వుండి ఎల్లప్పటికి కొనసాగుతూనే వుంటుంది. శారీరక ప్రేమ తల్లితండ్రులుగానే మిగిలిస్తుంది కాని వారిని ఒక జంటగా కట్టిపడేయలేదనేది ఒక వాస్తవం.