•  

మనసెరిగి సెక్స్ కు ఉపక్రమించండి!

How to satisfy Women in Sex
 
చాలామంది ఆడవారు తమ భాగస్వామి లేదా ప్రియుడితో సంపూర్ణ రతి క్రీడను ఆస్వాదించాలని ఉవ్విళ్ళూరుతూంటారు. ఈ విషయాన్ని గ్రహించలేని కొంతమంది పురుషులు తమ పిచ్చి చేష్టలతో భార్యకు లేదా ప్రియురాలికి చికాకు కలిగేలా ప్రవర్తిస్తుంటారు. ఇలా చేయడం వలన భాగస్వామి మీపై కోపగించుకోడం మాత్రమే కాకుండా సెక్స్ పట్ల విముఖత చూపే అవకాశాలు ఉన్నాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. అందువల్ల అర్ధాంగి లేదా ప్రియురాలి మనస్సెరిగి సెక్స్ కు ఉపక్రమించాలని వారు సూచిస్తున్నారు. సెక్స్ సమయంలో చేయకూడనివి కొన్ని ఉన్నాయని, వాటిని తప్పకుండా పాటించాలని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

చిర్రెత్తించే సెల్ ఫోన్ !
కాలంతో పాటు మనుషుల అలవాట్లు, వాడే వస్తువులు మారిపోతున్నాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారింది. 24 గంటల పాటు చేతిలో సెల్ ఉండాలన్న భావనతో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. ఈ ఫోన్ పడక గదిలో చేరి స్త్రీ పురుషుల మద్య సాగే ఏకాంత జీవితానికి విఘాతం కలిగిస్తోంది. సెక్స్ కొరకు సమాయత్తమైనపుడు ఫోన్ రింగ్ మోగడం ఏ భార్యా కూడా అంగీకరించదు. దీంతో సెల్ మోగినపుడు కోరికతో రగిలే శరీరాలు కా'స్తా గాలి తీసిన బెలూన్లలా చప్పబడి పోతాయి. ఇక అంతే...భర్త చెవిలో సెల్ ఫోన్, భార్య ముఖంలో కోపం ప్రత్యక్షమై ఒకే పడకపై ఎడమొహం...పెడమొహంగా పడుకుంటారు. ఇక ఆ రోజుకు
సెక్స్ కు అంతే సంగతులు.

వేళా...పాళా....
అలాగే, సెక్స్ లో పాల్గొనేందుకు సమయం సందర్భాన్ని పాటించాలి. వేళాపాళా లేకుండా ఎపుడు మూడ్ వస్తే అపుడు భార్యను సెక్స్ కు బలవంతం చేయడం కూడా ప్రమాదకరమేనని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఇలా చేయడం వలన రాత్రి సమయాల్లో కూడా భాగస్వామితో సెక్స్ లో పాల్గొనేందుకు పలువురు భార్యలు విముఖత చూపిస్తున్నట్టు వారు చెపుతున్నారు. అందుకే భార్యకు ఇష్టమైన సమయంలో సెక్స్ చేస్తూ... తనదారికి తెచ్చుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.

పిచ్చ పిచ్చగా ...
మరి కొందరు పురుషులు సెక్స్ కు ముందు తెగ హడావుడి పడిపోతుంటారు. భార్య కామ ప్రదేశాలను మృదువుగా స్పృశించాల్సిన చోట ఒడిసిపట్టి పిచ్చి పిచ్చిగా నొప్పి కలిగేలా ప్రవర్తిస్తుంటారు. దీంతో అప్పటి వరకు సెక్స్ కోసం తహతహలాడిన స్త్రీ ఆ రాక్షస చర్యతో భీతిల్లి ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందట. ఇదే పరిస్ధితి కొనసాగితే భర్తతో తెగతెంపులు చేసుకునేందుకు సైతం వెనుకాడదని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రతిక్రీడలు ఏ అడ్డంకి లేకుండా ఏకాంత ప్రదేశంలో చేయాలని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

English summary
Most of the women excite to enjoy sex to its full extent. However some men are not able to realise their needs and go wild with their mad behaviour in sex. With the result women get angry and show their unwillingness for the sex acts. Hence, the men should first know the tastes of the women before their sexual act to enjoy the act.
Story first published: Monday, August 1, 2011, 16:25 [IST]

Get Notifications from Telugu Indiansutras