తరచూ నలభై ప్రాయంలోకి వచ్చే సరికి పురుషులు లేదా స్త్రీలలో రతిక్రియ, రొమాన్స్‌కు సంబంధించిన పలు కోరికలు చచ్చిపోతాయని, తాము ముసలి వయసుకు దరిదాపుల్లోకి వచ్చేసినట్లు తెగ ఫీల్ అయిపోతుంటారు. కాని మనిషి శరీరంలో రతిక్రియకు సంబంధించిన కోరికలు, ఆలోచనలు చనిపోయేంత వరకుంటాయని పరిశోధకులు తెలిపారు. దీనికిగాను కొన్ని విషయాలను పాటిస్తే మీరు ఎంతటి రసికప్రియులో తెలిసిపోతుందంటున్నారు పరిశోధకులు
రొమాన్స్ లేదా రతిక్రియకు సంబంధం వయసుకాదని, అది మనసుతో ముడిపడివుంటుంది. 70-80ల్లోను రతిక్రియకు తమ జీవిత భాగస్వామితో రంజుగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. తరచూ ఆరోగ్యంగా ఉండేందుకు మీ ఆలోచనలను మరింత ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. రొమాన్స్ లేదా రతిక్రియకు సంబంధించిన అంశాన్ని మీ జీవిత భాగస్వామితో చర్చిస్తూ, చిలిపి చేష్టలు చేసేందుకు ఉద్యుక్తులవ్వండి.