ఇరువురికి ముఖ్యమైన రోజులను కచ్చితంగా గుర్తు పెట్టుకోవడం, ఆయా సందర్భాలలో శుభాకాంక్షలు తెలుపుకుంటే బంధం మరింత ధృడమవుతుందని పరిశోధనా సారాంశం. ఎంతటి చిరాకులోనైనా చిరునవ్వను దూరం చేయకపోవడం, సంతానం విషయంలో భర్త శ్రద్ధ భార్య మనసు గెలుచుకుంటాడంట. సరసంలో చమత్కారం మంచిదే గానీ, అదే పనిగా వెటకారాలు కాపురాలకు చేటు చేస్తాయని పరిశోధనలో వెల్లడయింది. దురలవాట్లకు తగ్గించుకోవడం ద్వారా భార్య మనసు గెలుచుకోగలరని, భార్యలు షాపింగ్ ప్రపంచం నుంచి బయటపడితే పురుషుడు ఊపిరి పీల్చుకుంటాడని రీసెర్చ్ ఉవాచ.
భార్యాభర్తల మధ్య బంధం ఎక్కువ కాలం సజావుగా ఉండటంలో రొమాన్సు ఒక్కటే కీలకం కాదని ఒక పరిశోధనలో వెల్లడయినది. ఆలుమగల అనుబంధాన్ని ఇంకో పది విషయాలు 98 శాతం వరకు ప్రభావితం చేస్తాయని రొమాన్సు పాత్ర కేవలం రెండు శాతమే ఉంటుందని నిర్ధారణ అయింది. అందులో ప్రధానమైనది కుటుంబ సంతోషం కోసం భార్యాభర్తలు తమ పని సమయాన్ని కచ్చితంగా త్యాగం చేయడం, ఏకాంతానికి సమయాన్ని కేటాయించుకోవడం అవసరమని తేలిందంట. ఆర్థిక స్వాతంత్రం విషయంలో భార్య పాత్రను గుర్తించడం, నిర్ణయం తీసుకునే ముందు పరస్పర అవగాహన కీలకమని ఆ పరిశోధనలో తేలింది. అదే సమయంలో పురుషుడు పట్టువిడుపులకు పోకుండా పరిస్థితిని సానుకూలంగా ఆలోచిస్తే ఫలితం ఉంటుందంట.