వీటిని ధరించడం వల్ల గుప్త రోగాల నుంచి రక్షించుకునేందుకు కండోమ్ గొప్ప సాధనంగా ఉపయోగించుకోవాలని చెపుతున్నారు. కండోమ్ మంచి కండిషన్‌లో వుండాలన్నా, మన్నికగా వుండాలన్నా దానిని చల్లని మరియు పొడి ప్రదేశంలో వుంచాలన్నది వైద్యుల సలహా. అలాగే, వీటిని కొనేటపుడు వాటి ఎక్స్‌పైరీ తేదీని చూసి కొనుగోలు చేయాలి. లేదంటే శృంగారంలో అవి చిరిగి ఇబ్బంది కలగడం వల్ల భార్యాభర్తల మూడ్ పోతుందని రతిలో పాల్గొన్న పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు.
సురక్షితమైన సెక్స్, సుఖవ్యాధుల బారిన పడకుండా ఉండే నిమిత్తం కండోమ్స్‌ను ధరించాలని సెక్సాలజిస్టులు సలహాలు ఇస్తుంటారు. అయితే, ఈ కండోమ్‌లు ధరించేందుకు చాలామంది పురుషులు అయిష్టతను వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు తమ మూడ్‌ను పాడుచేస్తుందనే భావన ఉంటుంది. కానీ, ఆరోగ్యాన్ని పాడుచేసుకోరాదని భావిస్తే కండోమ్ వాడకంలో ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. లూబ్రికేట్‌ చేయబడిన కండోమ్‌ను మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరకు ఏది లభిస్తే అది తీసుకుని వెళ్లి వాడితే కొన్ని సంధర్భాల్లో దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉందని వారు చెపుతున్నారు.