అధిక నరాల బలహీనతగలవారు రొమాన్స్‌లోను లైంగిక చర్యలలోను తక్కువ తృప్తి కలిగి వుంటారు. వీరికి పెళ్ళి అయిందంటే, విడాకులు తీసుకునే అవశాశాలు అధికం. వేరే వ్యక్తిగత కారణాలకంటే కూడా అధిక నరాల బలహీనత కారణంగా వివాహ సంబంధాలు చెడిపోతున్నాయంటారు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన టెన్నిసి విశ్వవిద్యాలయంలోని మైకేల్ రస్సెల్, జేమ్స్ మెకనల్టీ అనబడే మానసిక నిపుణులు. అయితే, వివాహ జీవితంలోని సెక్స్ వారిని ఆనందంగా వుంచగలదు. టెన్నిసీ విశ్వవిద్యాలయంనుండి వెలువడిన మరో అధ్యయనం కూడా లైంగిక చర్యలు చేసుకున్న జంటల మానసిక భావనలు మరుసటి రోజుకు ఎంతో మెరుగుపడ్డాయని కూడా తేల్చింది. అయితే, ఇపుడు తరచుగా చేసే లైంగిక చర్యలు నరాల బలహీనత ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేస్తాయా అనేది కూడా రస్సెల్, మెకనల్టీ అధ్యయనం చేస్తున్నారు.
వీరు 72 మంది కొత్తగా పెళ్ళైన జంటలను మొదటి నాలుగు సంవత్సరాలు పరిశీలించారు. వారి వైవాహిక జీవిత సంతృప్తి, ప్రతి ఆరు నెలలలోను ఎంత తరచుగా సెక్స్ చేసుకుంటారనేదానిపై భాగస్వాముల నివేదికలను వేరు వేరుగాను, ప్రైవేటుగాను సేకరించారు. ఈ కొత్త జంటలు చెప్పినదేమంటే, సగటున తాము వివాహమైన మొదటి ఆరు నెలల కాలంలో వారానికి ఒకసారి చొప్పున సెక్స్ చేసుకుంటామని, వివాహమైన నాలుగవ సంవత్సరంలో నెలకు మూడు సార్లు మాత్రమే చేస్తామని వెల్లడించారు. వైవాహిక జీవితం ఆనందంగా వుందని జీవిత భాగస్వామితో తన సంబంధం ఆనందంగా వుందనిచెప్పిన జంటలు తృప్తి కలిగిన జంటలుగా పరిగణించబడ్డారు. వైవాహిక జీవన తృప్తి వివాహ జీవితం మొదటిలోను లేదా నాలుగు సంవత్సరాల తర్వాత కూడా లైంగిక చర్యలకు వారు ముడిపెట్టలేదు.
అయితే, అధ్యయనకారులు రస్సెల్, మెకనల్టీలు ఒక ప్రధానమైన మినహాయింపును కనుగొన్నారు. అదేమంటే, అధిక స్ధాయి నరాల బలహీనతలున్న జంటలు సెక్స్ లో తరచుగా పాల్గొంటే వారి వైవాహిక జీవన సంతృప్తి మెరుగుపడిందని కనుగొనటం జరిగింది. సాధారణంగా మానసిక బలహీనతలుకల జంటలకు వుండే ఆనందపు లోటు లేదా కోల్పోయామనే భావన పూర్తిగా పోవాలంటే వారు తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే మంచిది.