•  

కలిసి జలకాలాడితే సెక్స్ జీవితం మజా

Bath together for great Sex life
 
సినిమాల్లో పురుషుడు స్నానానికి వెళ్తూ తన భాగస్వామిని లోనికి లాక్కోవడం చూస్తుంటాం. టవల్ లేదనో, సబ్బు లేదనో ఇవ్వాలని అడిగి ఆమెను బాత్రూం దాకా రప్పించి చేయి పట్టుకుని లోనికి లాక్కోవడం కూడా చూస్తుంటాం. ఆమె మొరాయించవచ్చు గాక, కానీ వృధా ఏమీ కాదు. మొరాయించడంలో కూడా సానుకూలత ఉందంటారు నిపుణులు. భార్యాభర్తలు కలిసి స్నానం చేస్తే సెక్స్ జీవితం మరింత ఉత్సాహభరితంగా ముందుకు సాగుతుందని అంటున్నారు. చల్లటి నీటి కిందనో, వేడి నీటి కిందనో కలిసి జలకాలాడుతూ సెక్స్ చేయడం వల్ల జీవితంలో ఉత్సాహం ఉరకలు వేస్తుందని ఓ సర్వేలో తేలింది.

కలిసి స్నానమాచరిస్తే దంపతుల మధ్య సాన్నిహితం పెరిగి బంధం బలపడుతుందని చెబుతున్నారు. కొంత మంది కలిసి బాత్రూంలో చొరబడడానికి సమయం కూడా కేటాయించుకుంటారట. బాత్రూం సెక్స్ వల్ల ఒత్తిడి పూర్తిగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇది అద్భుతమైన క్రీడగా కూడా ఉందనేది అనుభవజ్ఞుల మాట. ప్రేమికులు కలిసి స్నానమాచరిస్తే ఆ బంధం నిలబడుతుందని కూడా భావిస్తున్నారు. సినిమాల్లో వర్షంలో హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్లు అందుకే పండుతాయేమో.

English summary
Couples seems to have come out of the closet now and entered the bathroom, for a good shower.
Story first published: Thursday, July 14, 2011, 16:49 [IST]

Get Notifications from Telugu Indiansutras