యోని శీర్షం స్తంభిస్తుంది. అందుకు స్తంభక కండరాలు సహకరిస్తాయి. స్తంభించిన యోని శీర్షాన్ని స్పింక్టర్ కండరాలు బిజవాహిక వైపు లాగుతాయి. యోనిలోకి లింగం ప్రవేశించగానే యోని శీర్షం లింగాన్ని స్పర్షించి ఆమెను తీవ్రంగా ఉద్రేకపరచడానికి సహకరిస్తోంది. అప్పటికే బార్దోలిన్ గ్రంథులు, స్కీన్ గ్రంథులు ఇతర గ్రంథులూ చురుకుగా ద్రవపదార్థాలను విడుదల చేసి కుహకిరనూ, బీజవాహికనూ అభ్యంగన స్నానం చేయిస్తాయి.
స్త్రీలో కామవాంఛ కలగడానికి పురుషుని వల్ల ఆకర్షణ అవసరం. అలాంటి ఆకర్షణ వలన వల్లనో, యోనిలోని అంతర్భాగాల ప్రేరణ వల్ల గానీ స్త్రీ ఉద్రేకాన్ని పొందుతుంది. ఫలితంగా యోనిలోని నరాలు, కుహరిక, బీజవాహిక ఆమె వెన్నెముకలోని కామకేంద్రం ద్వారా ఉద్రేకింపబడతాయి. యోని బాహ్య ప్రాంతముల కుహరికలోని కందములు ఉబ్బి ఆ ప్రాంతం యిరుక్కు పోతుంది. యోనిలోని రక్తనాళాలన్ని పోటెక్కుతాయి. బాహ్య ధరాలు పక్కకు ఒత్తిగిలి, అంతరాధరాలు కొనలు కనిపించేలా చేస్తాయి. ఈ అంతరాధరాలు కూడా కొంచెం ఉబ్బుతాయి. కుహరికలోని కందములు రక్తంలో మరింత పోటెక్కి ప్రక్కకు వత్తిగిల్లుతూ బాహ్యాధరాలను ప్రక్కకు నెట్టుతాయి. అదే సమయంలో గుహ్యద్వారాన్ని మరింత మూసుకునేలా చేస్తాయి. అనగా యోని చెరుచుకుంటుంటే గుహ్యద్వారం అదే సమయంలో మూసుకుంటూ వుంటుందని అర్థం.