శృంగార భావనపై, సెక్స్‌పై మన సమాజంలో, కుటుంబాల్లో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకోవడమే పెద్ద నేరమనే విధంగా భావిస్తారు. అయితే సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణలు అంటున్నారు. శృంగారంలో పాల్గొనేవారు మానసిక ఒత్తిడికి లోనవరు. అంతేకాదు శృంగారం వల్ల మనిషికి కలిగే ఆరోగ్యం, సంతోషాలపై వాటిపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి.
శృంగారంలో సంతృప్తిగా పాల్గొనే మహిళలకు గుండెసంబంధిత వ్యాధులు రావని తేలింది. అలాగే మహిళలలో ప్రసవ నొప్పులను తగ్గించి, బాలింతలలో పాలను వృద్ధి పరిచేందుకు దోహదపడే ఆక్సిటోసిన్ హార్మోన్ దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేవారిలో అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి.
వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులలో ఇతరులకంటే గుండెపోటు సమస్య సగానికి సగం తగ్గినట్లు గుర్తించారు. శృంగార సుఖాన్ని అనుభవించే జంటల్లో వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువని తేలింది.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.