ఆడవారి ముఖంలో కనిపించే బాధను మరో మహిళ మాత్రమే చాలా స్పష్టంగా గుర్తించగలుగుతుందని తాము కనుగొన్నట్లు ఆ వర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్ సుసాన్ హ్యూజెస్ వెల్లడించారు. అయితే, మహిళల్లో భావప్రాప్తిని గుర్తించటంలో మాత్రం మగవారిదే అందెవేసిన చెయ్యి అని కూడా ఈ అధ్యయనం ద్వారా వెల్లడైందని ఆమె తెలిపారు. దాంపత్య జీవితంలో సంతోషం, బాధ కలిగే సమయాలలో ముఖకవళికలు ఎలా ఉంటాయన్న విషయంపై ఈ వర్శిటీకి చెందిన పరిశోధకులు సర్వే నిర్వహించారు. వీరి పరిశోధనలకు గాను స్త్రీ పురుషుల కలయిక సందర్భంగా తీసిన, ముఖ్యంగా ముఖకవళిలను ప్రతిబింభించే విధంగా తీసిన 91 మంది జంటల ఫోటోలను ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేసినట్టు ఆమె వివరించారు.
English summary
A survey revealed that men will identify satisfaction of women in Sex. Dace will reveal the satisfaction.