•  

అమ్మాయి అందానికి తెలివి తోడైతేనే సెక్సులో స్వర్గం

Kamasutra-Romance
 
అందమైన మగువలు తెలివిగల మహిళల కంటే శృంగారంలో వెనుకబడి ఉంటారంట. అందమైన యువతి కనబడితే చాలు అందరి చూపు అటే మరలుతుంది. అయితే ఈ అందమైన మగువలు శృంగారంలో మాత్రం తెలివిగల మహిళలకంటే వెనకబడి ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమే అంటున్నారు. లండన్‌లోని కింగ్స్ కళాశాలకు చెందిన అధ్యయనకారులు 2వేల మంది మగువలపై చేపట్టిన అధ్యయనంలో తెలివైన మహిళల్లో శృంగార చాతుర్యం ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.

అంతేకాదు భాగస్వాములను పూర్తిగా తృప్తి పరిచేందుకు అవసరమైన అన్ని మార్గాలను వారు అన్వేషిస్తారని తేలింది. కనుక తెలివిగలవారై ఉండటం వల్ల చదువు, కెరీర్‌లో ఉన్నత స్థానానికి రావడమే కాదు దాంపత్య జీవితంలోనూ ఉన్నతంగానే ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారికి ఓ ప్రశ్నావళిని అందించారు కళాశాల అధ్యయనకారులు. ప్రశ్నావళిలో వివిధ దశలలో భావప్రాప్తికి గురయ్యే సమయాలతోపాటు అసలు సెక్స్ సుఖాన్నే అనుభవించలేకపోతున్నాను వంటివాటిని చేర్చారు. సర్వేలో పాల్గొన్న మహిళలు పత్రాలను పూర్తి చేసిన తర్వాత వాటిని పరిశీలించారు.

చిత్రంగా ఆయా వృత్తులలో ఉన్నత స్థానాలలో ఉన్న తెలివిగల మహిళలు మాత్రమే తాము పూర్తిగా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపారు. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇక చురుకుగా లేని మహిళలు తరచు భాగస్వామితో గొడవలు పడటం జరుగుతుండటాన్ని గమనించామన్నారు.

English summary
Woman will give to her husband more satisfaction, If she talent with his buety.
Story first published: Sunday, April 24, 2011, 16:00 [IST]

Get Notifications from Telugu Indiansutras