అలాగే, బద్దకంగా, నిద్రమత్తులో ఉన్నప్పుడు, జబ్బు పడి కోలుకుంటున్న రోజుల్లో, బహిష్టుకు ముందు మూడు రోజులు, అనంతరం మూడు రోజులు, వసంత కాలంలో మహిళలు ఉద్రేకపడతారని చెబుతున్నారు. అలాగే ఉరుములు, మెరుపులతో వాన వచ్చినప్పుడు స్త్రీలలో కామం అధికంగా ఉంటుందని ఆ గ్రంథంలో చెప్పారు. పురుషులకు అలసట వల్ల నిద్ర వస్తుందని, కానీ స్త్రీలకు అలా కాకుండా కోరిక హెచ్చుతుందని అంటున్నారు. జబ్బు పడిన తర్వాత కొత్త రక్తం పడుతుందని, అదే కోరికలను రెచ్చగొడుతుందని చెబుతున్నారు.
స్త్రీలు ఎప్పుడు ఎక్కువగా ఉద్రేకపడుతారనే అంశాలను కూడా ప్రాచీన కామశాస్త్ర నిపుణులు తేల్చారు. అనంగరంగ అనే గ్రంధంలో ఈ విషయాలను పొందుపరిచారు. శారీరకంగా అలసినప్పుడు, ఎక్కువ కాలం వియోగంలో ఉన్న తర్వాత కలిసినప్పుడు, పురుడు వచ్చిన నెల తర్వాత, గర్భాన్ని ధరించిన మొదటి నాలుగు మాసాలు స్త్రీలు సెక్స్ పట్ల ఎక్కువ మక్కువ చూపుతూ ఉద్రేకం పొందుతారట.