అన్ని బంధనాలను తెంచుకున్నట్లు భావిస్తుంది. సెలవు వచ్చిందంటే కొందరైతే ప్రశాంతంగా కనిపిస్తారు. అదే సమయంలో కొందరు బార్లు, క్లబ్బులంటూ బిజీగా గడపడానికే ఎగబడతారు. కాని ఇంటి పట్టునే ఉండి జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొనేవారి జీవితం ప్రేమామృతం కురిసినట్లేనని పరిశోధకులు తేల్చి చెపుతున్నారు. సెలవుకావడం వల్ల కలిగే ప్రశాంతతతో లైంగిక అవసరాలు, కోరికలకు ప్రేమాస్పదులుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికాలో ఎక్కువ మంది కౌన్సెలింగ్ ఇచ్చేవారు వారాంతాలలో శృంగారాన్నే దంపతులకు సూచిస్తున్నారు. వారాంతాలలో దూరంగా వెళ్ళిపోవాలని చెప్పుతున్నారు. ఇదే వారిలో ప్రేమ, శృంగారాలను రేకెత్తిస్తుందని వెల్లడించారు.
పని ఒత్తిడి దంపతుల శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజూ సాయంత్రం అలసటతో కార్యాలయం నుంచి ఇంటికి చేరుకోవడం, మర్నాడు పొద్దున్నే లేచింది మొదలు ఆఫీసుకు బయలుదేరడానికి హడావిడి పడడం వల్ల దంపతుల సెక్స్ జీవితంపై ప్రభావం పడుతోందని అంటున్నారు. దీన్ని నివారించడానికి తగిన పద్దతిని ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు సెలవు రోజులను వాడుకోవాలని సూచిస్తున్నారు. సెలవు రోజులలోని జీవిత భాగస్వామితో చేసే శృంగారం ఒత్తిడి, పరధ్యానం, ఆందోళనలు, బాధ్యతల నుంచి బయట పడవచ్చునని వారి పరిశోధనలో చెపుతున్నారు. మామూలు రోజుల్లోనైతే వివిధ ఈ అంశాలు మనిషిపై తీవ్ర ప్రబావం చూపుతాయి. లైంగిక వాంఛను తుంచేస్తాయి. అయితే సెలవు అనగానే అంటే ఆ ముందురోజు నుంచే మనస్సు తేలికపడుతుంది.