వీరందరూ 20 నుంచి 75 ఏళ్ళ వయస్సు కలిగిన వారు. వీరందరూ శృంగార సామార్థ్యం కలిగిన వారే. వీరి నుంచి రాబట్టిన పలు సమాధనాలను పరిశీలించిన మీదట శృంగారం పట్ల పురుషులకున్న అభిప్రాయాలను పరిశోధన రూపంలో తెలిపారు. జీవనం విషయానికి వస్తే వారు ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పారు. ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే సమరసమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి మొగ్గు చూపుతారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కలిగి ఉండాలనే కోరుకుంటున్నారు.
కేవలం 2 శాతం మంది మాత్రమే శృంగారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తరువాత సమాజం, సంఘజీవిగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో కూడా సంఘంలో పేరు ప్రతిష్టలను కలిగి ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఆ అంశానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని అనుసరించి మగవారు శృంగారంకంటే సామాజిక గుర్తింపు, ఆరోగ్యానికే ఓటు వేశారని చెప్పారు.