పడకగదిలోని మంచం విశాలంగా ఉండేలా చూచుకోండి. బెడ్‌రూం గోడలకు రంగులు వేసే సమయంలో లేత రంగులను, ఆహ్లాదంగా ఉండే రంగులను ఎంచుకోండి. అలాగే పడుకునే ముందు పడకగదిలో మంచి సువాసనలు వెదజల్లే రూమ్ స్ప్రేలను ఉపయోగించండి, దీనివల్ల పడకగదిలోకి రాగానే శరీరం బడలిక మరచి మీలో శృంగార వాంఛలు రేకెత్తుతాయి. పడకగదిలో టీవీ కన్నా సంగీతం వినిపించే మ్యూజిక్ ప్లేయర్‌ను వాడండి. దీని ద్వారా చక్కని మంద్రమైన సంగీతం వినడం వల్ల మనసు తేలికపడి మీరు శృంగారం గురించి ఆలోచించగల్గుతారు. అలాగే బెడ్‌రూంకు అటాచ్‌డ్ బాత్‌రూం ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీకు కావల్సిన ఏకాంతం లభిస్తుంది. పడకగదిలో దృష్టంతా జీవిత భాగస్వామిపైనే కేంద్రీకరించడం మంచిది.
దాంపత్యజీవితంలో సెక్స్ ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.. భార్యాభర్తల సంబంధాన్ని మరింత పటిష్టం చేయడంలో సెక్స్ పాత్ర అత్యంత ప్రధానమైంది. సెక్స్ జీవితం ఎంత బాగుంటే ఆ దంపతుల మధ్య అనుబంధం సైతం అంతే బాగుంటుంది. అందుకే దంపతులు తమ శృంగార జీవితానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాంపత్య జీవితాన్ని నిత్య వసంతంగా మార్చుకోవడం మంచిది. అందుకు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దంపతుల సెక్స్ జీవితానికి పడకగది వేదిక కాబట్టి దాని అలంకరణ విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. శృంగారం విషయంలో దంపతుల మధ్య చక్కని ఉత్సాహం కలగడానికి పడకగదిలో ఏదైనా మంచి శృంగార భంగిమ ఉన్న ఫోటోను తగిలించండి. పడకగదిని మరే ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించకండి. అప్పుడే పడకగది మీ శృంగార జీవితానికి సౌకర్యవంతంగా ఉంటుంది.