•  

సడెన్ సెక్స్ వల్ల గుండెపోటు వస్తుందా?

Sex can kill you
 
వ్యాయామం లేకుండా అకస్మాత్తుగా జాగింగ్, సెక్స్ వంటి అకస్మాత్తు శారీరక కార్యకలాపాల వల్ల మనుషులకు గుండెపోటు ప్రమాదం ఉంటుందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. శారీరక కార్యకలాపాల వల్ల తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. అయితే, ఆ ప్రమాద స్థాయి ఏ మేరకు ఉంటుందనేది బోస్టన్‌లోని టఫ్ట్స్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ ఇస్సా దహబ్రేహ్ చెప్పారు. పరిశోధనా బృందం 14 అధ్యయానాలకు సంబంధించిన వివరాలను విశ్లేషించింది.

వ్యాయామానికి, సెక్స్‌కు, గుండెపోటుకు మధ్య గల సంబంధాలను ఆ బృందం విశ్లేషించింది. వ్యాయామం చేయనప్పటి కన్నా వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు ప్రమాదాన్ని లేదా గుండెపోటుతో మృతిని ఎదుర్కున్న సందర్భాలు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఆ పరిశోధకులు తేల్చారు. తరుచుగా సెక్స్ చేయకుండా అకస్మాత్తుగా అందులోకి దిగితే 2.7 సందర్భాల్లో గుండెపోటుకు గురైనట్లు తేలింది. రెగ్యులర్ సెక్స్ వల్ల ఈ ప్రమాదాలు తగ్గుతాయని కూడా పరిశోధనలో తేలింది. రెగ్యులర్ శారీరిక శ్రమ వల్ల కూడా ఈ ప్రమాదాల స్థాయి తక్కువగా ఉంటుంది తేల్చారు.

పై ఫలితాలను బట్టి చూస్తే, స్త్రీపురుషులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. సెక్స్‌లో కూడా రెగ్యులర్‌గా పాల్గొంటే నష్టం లేదు. అనూహ్యంగా, ఆకస్మాత్తుగా పాల్గొంటే మాత్రమే ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని తేలింది. అందువల్ల దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలవాటు లేనివారు మెల్లగా వ్యాయామం ప్రారంభించి, రెగ్యులర్‌గా చేస్తే ప్రమాదం ఉండదు.

English summary
Sudden bursts of moderate to intense physical activity -- such as jogging or having sex -- significantly increase the risk of having a heart attack, especially in people who do not get regular exercise, US researchers said on Tuesday.
Story first published: Wednesday, March 23, 2011, 16:08 [IST]

Get Notifications from Telugu Indiansutras