దంపతుల మధ్య సెక్స్ గురించి ఇటీవల అమెరికాలోని ఔత్సాహిక పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీని ప్రకారం సెక్స్‌లో తరచూ పాల్గొనే మహిళల్లో డిప్రెషన్‌లాంటి సమస్యలు తక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే ఉదయం పూట సెక్స్‌లో పాల్గొనే దంపతుల్లో ఆరోగ్యం మెరుగవుతోందని కూడా తెలియవచ్చింది. వారంలో దాదాపు మూడుసార్లు ఇలా ఉదయం పూట సెక్స్‌లో పాల్గొన్నవారిలో రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా రక్తప్రసరణ సైతం చక్కగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. వీటితో పాటు ఉదయంపూట సెక్స్‌లో పాల్గొనే వారిలో రోగనిరోధకశక్తి సైతం పెరిగినట్టు ఈ పరిశోధనలో తేలింది.
పగటిపూట దంపతుల మధ్య సెక్స్ మంచిది కాదనే అభిప్రాయం ఇప్పటికీ ప్రబలంగా ఉంది. సెక్స్ కార్యం రాత్రిపూట మాత్రమే జరగాలని, అదీ పడకగదిలో మాత్రమే జరగాలని మన పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రఖ్యాత సెక్సాలజిస్టులు మాత్రం సెక్స్‌కు కావాల్సింది భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కోరికే తప్ప సమయం సందర్భం కాదంటారు. వీరు చెబుతున్న ప్రకారం భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం లేనపుడు సమయం, సందర్భం ఎంత మంచిగా ఉన్నా వారి మధ్య జరిగే శృంగారం అది సంతృప్తికరంగా ఉండదంటారు.