•  

సెక్స్‌ గురించి పరస్పరం నేర్చుకోవాలి

Kamasutra-Srungaram
 
ఎలాంటి లోపం లేని జంటలు సెక్స్‌లో పాల్గొనకుండా తీవ్రమైన అసంతృప్తితో ఎన్నో రాత్రులు వెళ్లదీస్తున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. సాధారణంగా జీవితంలో అవసరమైన అనేక అంశాలు పెద్దలు నేర్పితే నేర్చుకునేవే. నడక చేయి పట్టుకుని నేర్పించాలి. అయితే, సెక్స్ గురించి ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సెక్స్ భంగిమల గురించి, సెక్స్ అనుభవించే తీరు గురించి ఒకరు విడమర్చాల్చిన పని అంతకంటే లేదు. సెక్స్‌ అనుభవం అనేది ప్రతి వ్యక్తికి జన్యుపరంగానే వచ్చే లక్షణంగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి సహజసిద్ధమైన ఆనందాన్ని అనుభవించడంలో లోపాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో ఎవరికీ అంతుచిక్కదు. సాధారణంగా సెక్స్‌ గురించి తెలుసుకునేందుకు ప్రతి యువతీ యువకులు తాము పెళ్లీడు కొచ్చినప్పటి నుంచే ఆసక్తి చూపుతారు. యువతులు పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో దీని గురించి తెలుసుకునేందుకు శ్రద్ధ చూపుతారు. అయితే, సెక్స్‌ను అనుభవించే సమయంలో భార్యాభర్తలు లేదా యువతీయువకులిద్దరూ గురుశిష్యులతో సమానం.

తమకు తెలిసిన రతి భంగిమలు చెప్పుకోవడం, సెక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఇద్దరూ సిగ్గు విడిచి ముచ్చటించుకోవడం చేయాలి. ముఖ్యంగా, తమకు తెలిసిన మెళకువలను ఒకరికొకరు చెప్పుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరాదు. అలాగే, చెప్పే విషయాన్ని శ్రద్ధగా నేర్చుకునేందుకు చొరవ చూపాలి. అప్పుడే సెక్స్‌ను సంపూర్ణంగా అనుభవించగలుగుతారు.

Story first published: Wednesday, February 2, 2011, 17:08 [IST]

Get Notifications from Telugu Indiansutras