అయితే ఎప్పుడూ ఒకేలా ఉండటం కంటే సెక్సులో, రొమాన్సులో విభిన్న తరహాలు ఆలోచిస్తే భాగస్వామ్యులిరువురికి సంతోషంగా ఉంటుందంటున్నారు. ఇవన్నీ ఎంతో తీయగా తలచుకునే కొలదీ మధురాతిమధురంగా ఉంటాయి. మానవుని మెదడు విచిత్రమైన గుణాన్ని కలిగి ఉన్నట్లు వారు కనుగొన్నారు. మెదడు ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలని ఆరాటపడుతుందట.
తొలిప్రేమనాటి తొలిముద్దు ఎంత తీయగా ఉన్నప్పటికీ అదే ముద్దును తిరిగి రుచి చూపిస్తూ ఉంటే మెదడు బోర్ బోర్ అని గోలపెడుతుందట. అందువల్లనే మనిషి ఎప్పటికప్పుడు కొత్త రకం సరసరసాలను కనుగొని అందులో ఓలలాడుతుంటాడని వెల్లడించారు. ఇక పడకగది జీవితానికి వస్తే ప్రేయసీప్రియులిద్దరూ ఆలుమగలై తొలిరేయి నాడు గడిపిన క్షణాలు మత్తులోకి తీసుకెళ్లడం ఖాయం.
అయితే అదే భంగిమ కొన్నాళ్లకు బోర్ కొడుతుంది. కొత్తదనపు అనుభవం కావాలని ఆరాటపడుతుంది. దీంతో సదరు భర్త/భార్య తనపై ప్రేమ తగ్గిపోయిందని బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. నిజానికి ఇక్కడ వారి శృంగార జీవితాన్ని నడిపించేది మెదడు. ఆ శృంగారపు మెదడుకు పాత చింతకాయ పచ్చడి భంగిమల పట్ల వెగటుపుడుతుంది.