సెక్స్ కోసం పురుషులు తమ భార్యలను ప్రేమిస్తారని, తమ భర్తల నుంచి ప్రేమను పొందడానికి భార్యలు సెక్స్‌ లో పాల్గొంటారని ప్రముఖ సెక్సాలిజిస్టు డాక్టర్ దీపక్ అరోరా అంటున్నారు. దాని వల్ల పరస్పరం అనుభవాన్ని పరిపూర్ణం చేసుకుంటారనేది ఆమె అభిప్రాయం. మహిళలు కూడా అంతే ఇష్టం చూపి, సెక్స్ ‌లో పాల్గొంటే లైంగిక సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయని ఆమె అంటున్నారు. సెక్స్ డ్రైవ్ పురుషుల సొంతమనే అభిప్రాయం పాతబడిందని, వివిధ లైంగిక పద్ధతుల ద్వారా మహిళలు కూడా తమ సెక్స్ అపీల్‌ను పెంచుకోవచ్చునని డాక్టర్ గీతా భరద్వాజ్ అంటున్నారు. పడక గదిలో మహిళలు తమ సాధికారితను ప్రదర్శించి సెక్స్‌లో పురుషుడిపై ఆధిక్యత సాధించవచ్చునని అంటున్నారు.
పురుషులు సెక్స్ దాహంతో వేగిపోయే జీవులనే అభిప్రాయం బలంగా ఉంది. జీవిత భాగస్వామితో పోలిస్తే పురుషులు సెక్స్‌ లో చురుగ్గా వ్యవహరిస్తారు. పడక గదిలో సెక్స్ కార్యకలాపాల్లో వారిదే ప్రధాన పాత్రగా ఉంటూ వస్తోంది. ఆనందాన్నంతా కూడా వారే జుర్రుకుంటారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే, స్త్రీలు కూడా కాస్తా ముందుకు సాగితే, తమలో కూడా సెక్స్ డ్రైవ్ పెంచుకుంటే ఆనందం సరిసమానంగా దక్కుతుందని అంటున్నారు.