పని గంటలు పెరిగి సతమతమవుతున్న సదరు భర్తలకు ఇది కొత్త తలనొప్పిగా మారినట్లు ఐఐపీఎస్ సంస్థకు చెందిన బృంద సభ్యులు వెల్లడించారు. సుమారు 70 నుంచి 80 శాతం నెలలో రెండు మూడు రోజులు తప్పించి దాంపత్య సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని సర్వేలో వెల్లడైంది. ప్రతి 20మంది మగాళ్లలో ఒకరు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు ఆ సర్వేలో వెలుగు చూడటం గమనార్హం. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా సుమారు ఆరు శాతం పురుషులు సెక్స్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సర్వే నిర్వహించిన బృంద సభ్యులు వెల్లడించారు.