బంధం, భవిష్యత్తు సంబంధ ఆపేక్షలు, స్పెర్మ్ ను రిటెన్షన్, కాంపిటీషన్, మోట్ గార్డింగ్, గర్భం దాల్చడం వంటి అనేక కోరికలు స్త్రీలు అలా ప్రవర్తించడానికి కారణని అంటున్నారు. భిన్నమైన రిప్రొడక్టివ్ స్ట్రేజీస్ వల్ల సెక్స్ తర్వాత ప్రవర్తనలు స్త్రీపురుషుల్లో ఒకే విధంగా ఉండవని ఆమె అన్నారు. స్త్రీలు సన్నిహిత సంభాషణ, ముద్దులు పెట్టుకోవడం, కౌగలించుకోవడం, తన ప్రేమను వ్యక్తం చేయడం, సెక్స్ తర్వాత సంబంధం గురించి మాట్లాడుకోవడం వంటి విషయాలపై స్త్రీలు ఆసక్తి కనబరిచినట్లు ఆమె తెలిపారు. సెక్స్ కు ముందు ముద్దులు పెట్టుకోవడాన్ని పురుషులు ఇష్టపడుతుండగా, సెక్స్ తర్వాత ముద్దులు పెట్టుకోవడాన్ని స్త్రీలు ఇష్టపడినట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆమె చెప్పారు.
శృంగార కార్యకలాపాల తర్వాత మహిళ పురుషుడిని కౌగిలించుకుని పడుకుంటుంది. మత్తుగా పురుషుడిని హత్తుకుని పడుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది. దాని వెనక గల కారణాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టే ప్రయత్నం చేశారు. జీవిత భాగస్వామితో వారు సాన్నిహిత్యాన్ని, బంధాన్ని కోరుకుంటారని వారంటున్నారు. సెక్స్ తోనే రిప్రొడక్టివ్ స్ట్రేజీస్ అయిపోవని, సెక్స్ తర్వాత కూడా అవి పనిచేస్తుంటాయని సెక్స్ తర్వాత స్త్రీల ప్రవర్తనపై అధ్యయనం చేసిన సుసాన్ హ్యూజెస్ అంటున్నారు.