•  

సెక్స్ లో అది అపోహ మాత్రమే

It is a feeling in Sex
 
చాలామంది పురుషుల్లో అంగ స్తంభన ఒక సమస్యగా ఉంటుంది. దీన్ని ఒక వ్యాధిగా భావించే పలువురు తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీని గురించే ఆలోచిస్తూ మథనపడుతుంటారు. ఇలాంటి అపోహలు యువకుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిపై కొందరు పురుషులు అతిగా స్పందించి దాని గురించే ఆలోచిస్తూ సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటారు. ముఖ్యంగా పురుషాంగం పరిమాణం ప్రతి వ్యక్తిలోనూ ఒకేలా ఉండదు. పెద్ద సైజులో ఉన్నంత మాత్రాన అందులో ప్రత్యేకించి విషయమేమీ ఉండదు. అలాగే చిన్న సైజు వల్ల సెక్స్‌కు పనికి రాకుండా పోయేదేమి లేదు. అయితే ఇలాంటి వారు తమ అంగ పరిమాణాన్ని చూసుకుని కొందరు జీవితంలో ఇక తాము సెక్స్ కు పనికిరామనే నిర్థారణకు వచ్చేస్తుంటారు. ఇలాంటి భావనకు లోనుకావడమే అపోహ.

మరికొందరు ఆత్మన్యూన్యతను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇంకొందరు విచిత్రంగా తమ బాధలు చెప్పుకోలేక నకిలీ వైద్యులను సంప్రదించి మోసపోతుంటారు. స్పందన లేనప్పుడు అంగ పరిమాణం చాలా తక్కువ పరిమాణంలో ఉండటం సహజం. శృంగార జీవితానికి కావలసింది పొట్టి, పొడుగు, వంకర. చిన్న అనే విషయాలు ముఖ్యం కాదు. మనుషుల సైజులలోనే ఎన్నో తేడాలు ఉంటాయి. రంగుల్లో, రూపురేఖల్లో కూడా ఇవి స్పష్టంగా తెలుస్తున్నాయి. పురుషుల అంగ పరిమాణంలోనూ తేడాలు కనిపిస్తాయి. స్త్రీల విషయంలోనూ అంతే. అయితే పురుషులు స్పందించినట్లుగా వాళ్లలో అటువంటి పరిస్థితి ఉండదు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే శృంగారానుభూతి మాత్రమే. స్పందనలు ఉన్నాయా లేవా అన్నదే ప్రధానాంశం. తృప్తిచెందడం అనేది మానసిక భావన. మనసు ఉల్లాసంగా ఉంటే అదే లక్షకోట్ల ఆనందం ఇస్తుంది. అదే మానసిక స్థితి బాగోలేనప్పుడు ఎంతగా స్పందించినా సంతృప్తి అనేది లభించదు. అందుకే భార్యాభర్తలు ఇద్దరిలోనూ ముందు ఒకరినొకరు ఇష్టం కలిగించుకునేలా నడుచుకోవాలి. ఒకరులేనిదే మరొకరు లేరనే భావన ఇద్దరిలో కలిగినప్పుడే వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నూటికి నూరు శాతం తృప్తి పొందుతారు.

Story first published: Saturday, December 4, 2010, 17:14 [IST]

Get Notifications from Telugu Indiansutras