సెక్స్ వ్యాయామం లాంటిది

Sex will generate Power
 
సెక్స్ వ్యాయామం లాంటిదని వైద్యులు చెపుతారు. ఒకసారి సెక్స్‌లో పాల్గొంటే 159 క్యాలరీల శక్తి ఖర్చవుతుంది. ఎన్నిసార్లు పాల్గొంటే అన్నిసార్లు ఇలా క్యాలరీలు ఖర్చవుతాయి. ఇది లావుగా ఉన్నవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. లావుగా ఉన్న వ్యక్తులు సెక్స్‌లో పాల్గొనడం వల్ల శరీరంలో క్యాలరీలు తగ్గి ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అదేసమయంలో గుండెకూ శక్తి పెరుగుతుంది.

సెక్స్ తారాస్థాయికి వెళ్లినపుడు గుండె నిమిషానికి దాదాపు 160సార్లు కొట్టుకుంటుంది. రక్తపోటు పెరుగుతుంది. ఇలా కొద్దిసేపు గుండె ఎక్కువ పనిచేయడంతో దానికి అది వ్యాయామమే అవుతుంది. గుండె కండరాలకు, వెన్నుపూసకు, కాళ్లకు అంతటా సెక్స్ వల్ల మంచి వ్యాయామం లభిస్తుంది. మానసిక ఉల్లాసం కూడా తోడవడంతో టెన్షన్ వంటివి కూడా దరిచేరవు. కనుక సెక్స్ అనేది ఓ చక్కని ఎక్సర్‌సైజ్ లాంటిదని చెప్పవచ్చు.

Story first published: Monday, November 8, 2010, 17:31 [IST]
Please Wait while comments are loading...