•  

జంట స్నానంతో సెక్స్ తృష్ణ

Kamasutra
 
ఆధునిక యువతీ యువకులు సెక్స్ పట్ల విపరీతంగా ఆకర్షితులవున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. కానీ పెళ్లయిన తర్వాత వారు ప్రతినిత్యం సెక్స్ ను అంతే హుషారుతో సాగిస్తున్నారా? అంటే చాలా వరకు సమాధానం లేదనే చెప్పొచ్చు. సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రొటీన్‌ సెక్స్‌ భాగస్వామికి విసుగు కలిగి చిరాకు పుట్టిస్తున్నట్లు కొందరు చెప్పే మాట. మరికొంత మందిలో ఓపిక సన్నగిల్లడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు మాత్రమే సెక్స్‌లో పాల్గొనడం జరుగుతుంది.

మరికొంతమంది అతికష్టంగా ఈ కార్యం అయిందని అనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుడిలో యవ్వన శక్తికి కొదవ లేనప్పటికీ రొటీన్ సెక్స్ అనుభవించడం వల్ల వారికి, వారి భాగస్వామికి విసుగు, చిరాకు పుట్టిస్తుంది. అటువంటి వారికి కామశాస్త్ర నిపుణులో చెప్పే చిట్కాల్లో ఒక్కటి జంట స్నానం చేయడం. మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా శరీరాల్లో సెక్స్ స్పందనలు కలుగుతాయి. అంతేకాదు ఆ సమయంలో ఒకరిపై మరొకరు సెక్సీ జోకులు విసురుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు పెరిగే అవకాశం ఉంది.

Story first published: Thursday, November 18, 2010, 17:48 [IST]

Get Notifications from Telugu Indiansutras