వాత్యాయనుడు పుట్టిన గడ్డ మీద ఇక్కడి పురుష వుంగవులు అనవసర అపోహలతో ప్రకృతి సిద్ధంగా శృంగారంలో పాల్గొనటం వదిలేసి వయాగ్రా వాడుతున్నరు. లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అలాంటివి వాడాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. వయాగ్రా వాడేవారిలో ఎక్కువ శాతం మంది అనవసరంగా భయపడటం, ఒత్తిళ్లకు గురవ్వటం వల్లనే వారు వయాగ్రా వైపు చూస్తున్నారు. డ్రగ్సు మత్తులో పడిన నేటి యువత ఇంకా అనేక దురలవాట్లు చేసుకొని ఆ మోజులు కూడా సెక్సు సామర్థ్యాన్ని కోల్పోయిన వారు కూడా కొందరు ఉన్నారు. అయితే ఇవన్నీ ఏమీ లేకుంటే సెక్సుకు సహజశక్తి చాలంటున్నారు డాక్టర్లు. సమయానికి భోజనం చెయ్యటం, ఫాస్టు ఫుడ్ కు బదులు పండ్లు, పాలు, కూరగాయలు తదితరాలు తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. పడక గదిలో సుఖంగా ఉండాలంటే కావాల్సింది వయాగ్రా కాదు. భయం, అపోహలు లేక పోవటం, ఒత్తిడి తగ్గించుకోవటమేనంటున్నారు వైద్యులు.