•  

మధ్యవయస్సులో సెక్స్ తగ్గుతుందా

Sex in middle age
 
కొంత వయసు పెరిగిన తర్వాత సెక్స్‌ జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు వ్యక్తుల్లో ఓ విధమైన అనాసక్తత చోటు చేసుకుంటుంది. అదేసమయంలో కొన్నిసార్లు మనసులో కోరిక చెలరేగినా శరీరం సహకరించడానికి మొరాయిస్తుంది. దీంతో సెక్స్ జీవితం అంటే సమస్యలమయంగా తయారవుతుంది. ఇలా మధ్య వయసు దాటిన తర్వాత సెక్స్ జీవితం పరంగా స్త్రీలలో తలెత్తే ఈ రకమైన శారీరక సమస్యకు వైద్య పరిభాషలో మోనోపాజ్ అని అంటారు. అలాగే ఇదే రకమైన సమస్యలు మగవారిలో తలెత్తితే దానిని మేల్ మోనోపాజ్ లేక ఆండ్రోపాజ్ అంటారు. కొన్నాళ్ల వరకు మోనోపాజ్ అనే పదం అందరికీ సుపరిచితమైనా ఆండ్రోపాజ్ అనేది మాత్రం ఇటీవలే అందరికీ తెలిసొస్తోంది.

ఎందుకంటే మధ్య వయసు తర్వాత హార్మోన్ల సమతుల్యత దెబ్బ తిని స్త్రీలలో మాత్రమే మోనోపాజ్ దశ ఏర్పడుతుందనే భావన దాటి ఆదే విధమైన సమస్యలు పురుషుల్లోనూ తలెత్తుతుతాయని తెలిసి వచ్చింది. దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో ఈ ఆండ్రోపాజ్ దశ తలెత్తుతుంది. ఈ ఆండ్రోపాజ్ వల్ల సెక్స్ జీవితంలో ఆసక్తి లోపించడం, అంగస్థంభన సమస్యలు తలెత్తడం ప్రధానమైంది. శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం అదుపుతప్పడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే శరీరంలో తగ్గిన టెస్టోస్టిరాన్ హార్మన్ స్రావం తగినంత ఉండేలా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.

ఇందుకోసం ముందు నుంచే ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సమస్య రాకుండా ఉండేందుకు అవకాశముంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సోయా, పాలు, చికెన్‌లాంటి పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం, వేరుశెనగ, బాదం, జీడిపప్పులాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావాన్ని పెంచవచ్చు. దీంతోపాటు సి, ఇ విటమిన్లు సంవృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాన్ని కూడా అవలంభిస్తే ఆండ్రోపాజ్ సమస్య నుంచి వీలున్నంత దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ పాటించీ ఆండ్రోపాజ్ సమస్య బాధపెడితే వైద్యుల సలహా మేరకు హార్మోన్ చికిత్స చేసుకోవడం మంచిది.

Story first published: Thursday, October 28, 2010, 16:19 [IST]

Get Notifications from Telugu Indiansutras