నిజానికి సెక్స్ కోర్కెలనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. వంశపారంపర్య లక్షణంగా, శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, వయస్సు, తగిన జోడు వంటివాటిని బట్టి సెక్స్ కోర్కెలు ఉంటాయి. మనిషిలో కొన్ని సందర్భాల్లో అధికంగా సెక్స్ కోర్కెలు ఉవ్వెత్తున ఎగసిపడటం, మరికొన్నిసార్లు తక్కువగా ఉండటం సహజమే. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరిలో చోటుచేసుకుంటున్న సమస్యలు మానసిక ఒత్తిడి, ఆందోళనలు. వీటికి మెడిటేషన్ ద్వారా చెక్ పెట్టాలి. సెక్స్ పవర్‌నిచ్చే పోషకాహారాలు తీసుకుంటే దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. వివాహమైన తొలినాళ్లలో రోజుకు మూడునాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొన్న విధంగానే పాల్గొనవచ్చు
వయస్సు పెరిగిన కొద్దీ రకరకాల కుటుంబ సమస్యలు, ఆఫీసు, వ్యాపార సమస్యల వల్ల రతి సామర్ధ్యం, రతిపై ఆసక్తి కొద్దిగా తగ్గడం సహజమే. అంతమాత్రాన తమలో సెక్స్ సామర్థ్యం పూర్తిగా నశించిపోయిందని కంగారు పడకూడదు. వివాహమైన తొలి రోజుల్లో రోజుకు మూడు నాలుగుసార్లు రతి జరిపి ఆ తర్వాత కాలంలో రతి చేసే సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని బాధపడేవారు చాలా మంది ఉంటారు.