•  

రొమ్ముల సైజు తక్కువగా ఉంటే...

If Breast is small
 
స్త్రీలలో ఎక్కువమంది బాధపడేది తమ వక్షోజాల పరిమాణం గురించే. మగవాళ్లు పురుషాంగం బాగా లావుగా పొడవుగా ఉంటే స్త్రీలు ఇష్టపడతారని ఎలా అనుకుంటారో, తమ వక్షోజాలు బాగా ఎత్తుగా పెద్దవిగా ఉంటే మగాళ్లు ఇష్టపడతారని స్త్రీలు అనుకుంటారు. అయితే అది అపోహ మాత్రమేనట. వివాహమయ్యాక, కాన్పు తర్వాత వివిధ అవస్థలలో వచ్చే శారీరక మార్పులు, పెద్దవి చిన్నవిగా, చిన్నవి పెద్దవిగా మారుతూ ఉంటాయి. అలాగే కొందరు స్త్రీలలో వక్షోజాలు గుండ్రంగా ఉంటే, మరికొందరివి జారినట్లు ఉంటాయి. ఇంకొందరికి చనుమొనలు ముడుచుకుపోయి ఉంటాయి. కొన్ని చనుమొనలు ముందుకు పొడుచుకువచ్చినట్లు ఉంటే కొన్ని సమాంతరంగా కనిపిస్తాయి.

చాలామందిలో రెండు వక్షోజాలు, రెండు చనుమొనలు ఒకే పరిమాణంలో ఉండవు. ఇది సహజమే. తమకున్న అందాలతో సెక్స్‌ లో పాల్గొని ఆనందించాలి తప్ప వాటి ఆకృతుల గురించి బెంగపడకూడదు. వక్షోజాలు పెద్దవీ, చిన్నవీ అనే ఆలోచనకు తావు ఇవ్వద్దని నిపుణులు అంటున్నారు. ఇక చిన్నసైజు వక్షోజాలతో బాధపడేవారు వక్షోజాల కింద ఉండే కండరాలకి బలాన్నిచ్చే వ్యాయామం చేయడం వల్ల కొంతవరకూ వాటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అప్పటికీ ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే కాస్మొటిక్ సర్జన్‌తో ఆగ్‌మెంటేషన్ మామోప్లాస్టీ చేయించుకుని పాలిండ్లను పెద్దవిగా చేసుకోవచ్చు. అయినా స్త్రీల వక్షోజాలు ఏ సైజులో ఉన్నప్పటికీ మగవారు తమ మనసుకు నచ్చినవారి పట్ల తమ ప్రేమను తెలుపుతారు. ఇక్కడ వక్షోజ ఆకృతులకు ఆకర్షణకు సంబంధమే ఉండదు.

Story first published: Tuesday, October 19, 2010, 16:33 [IST]

Get Notifications from Telugu Indiansutras