హస్తప్రయోగంపై ఉన్నట్లుగానే, వీర్యస్ఖలనంపై సమాజంలో చాలా అపోహలున్నాయి. రతిలో పాల్గొనకపోయినప్పటికీ వీర్యస్కలనం జరుగుతుండడంపై యువకులు ఆందోళనకు గురవుతారు. దాని వల్ల భవిష్యత్తులో సెక్స్ కు పనికి రామని, పెళ్లి చేసుకుంటే అభాసు పాలవుతామని భయపడుతుంటారు. కానీ కామశాస్త్ర నిపుణులు అటువంటి భయాలు, ఆందోళనలు అవసరం లేదని చెబుతున్నారు. నిద్రలో వీర్యస్ఖలనం జరగడాన్ని స్వప్నస్ఖలనం అంటారు. ఇది వ్యాధి కాదు. సహజంగానే చాలా మంది యువుకుల్లో కలుగుతుంది. దాదాపు 83 శాతం మంది కనీసం ఒక్కసారైనా స్వప్నస్ఖలనానికి గురై ఉంటారని కీన్సీ గుర్తించారు. స్పప్న స్ఖలనాన్ని ఆపడం కూడా సాధ్యం కాదు. అలా కావడం వల్ల ఆరోగ్యానికి హానికరం కాదు. లోపం కూడా ఏదీ రాదు. వీర్యం బయటకు వెళ్లే మార్గాలున్నప్పుడు అటువంటిది సంభవించింది. హస్తప్రయోగం చేసుకుంటే స్పప్న స్ఖలనాలు ఉండకపోవచ్చు.