సెక్స్ లో పాల్గొనడంపై ఈ ఆధునిక ప్రపంచంలోనూ పలు అపోహలున్నాయి. అది తప్పుగా భావించేవారూ ఉన్నారు. అదో పాపకార్యంగా భావించే వాళ్లున్నారు. కానీ అది తప్పు కాదని, పవిత్ర కార్యమని భారతీయ సంప్రదాయం చెబుతోంది. వేదాలు శృంగారనికి పెద్ద పీట వేశాయి. పవిత్రమని చెప్పాయి. ఈ పవిత్ర కార్యానికి పూనుకున్నప్పుడు మనసూ, శరీరమూ పవిత్రంగా ఉండాలని చెబుతున్నాయి. పవితర్ దృష్టితో సెక్స్ లో పాల్గొంటే వాజపేయ యజ్ఞం చేసినంత ఫలితమట. మైథునం పరమం తత్వం..సృష్టి స్థితి అన్యకారకం..విశ్వం పుట్టుకలో, కొనసాగింపులో, వినాశనంలో మైథునమే మూలసూత్రమని పరమ శివుడు కైలాస తంత్రంలో అంటాడు. బృహదారణ్యక ఉపనిషత్తు స్త్రీ శరీరాన్ని యజ్ఞవాటికతో పోల్చింది. సంగమాన్ని సృష్టి యాగమని అభివర్ణించింది. అశ్వమేథమైనా, రాజసూయ యాగమైనా..ప్రత్యక్షంగానో పరోక్షంగానో లైంగిక క్రతువులు ఉండి తీరాల్సిందే. మనకు లింగ పూజలు కూడా కొత్తేమీ కాదు. అందువల్ల సెక్స్ లో ఏ విధమైన తప్పు లేదని తెలుస్తోంది.